తెలుగులో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 2  రోజు రోజుకీ ఎమోషనల్ గా సాగుతుంది.  గిల్లి కజ్జాలు, చిత్రమైన టాస్క్ లు ఒకరిపై ఒకరి ఆరోపణలతో ఆసక్తి రేపుతుంది.   ఈ పోటీలో గెలుస్తాడని అందరూ భావిస్తున్న కౌశల్ పై ఓ టాస్క్ లో మిగతా కంటెస్టెంట్స్ అందరూ కలిసి మూకుమ్మడి దాడి చేయగా, అందరినీ హెచ్చరించిన బిగ్ బాస్, ఆ టాస్క్ ను రద్దు చేస్తున్నట్టు ప్రకటించాల్సి వచ్చింది.  ఎప్పుడో జరిగిన సంఘటనలు తలచుకుని మరీ హౌస్‌మేట్స్ గొడవ పడుతున్నారు.
ముఖ్యంగా కౌశల్, హౌస్‌మేట్స్ మధ్య మాటల యుద్ధం జరిగింది.

గీతతో ‘బూస్టింగ్’ చర్చ నుంచి మొదలైన గొడవ.. చివరికి కౌశల్ ‘అందరూ కుక్కల్లా మీద పడుతున్నారు’ అనడంతో ఇదే అదును గా భావించిన హౌస్ మెట్స్ అతన్ని దారుణంగా టార్గెట్ చేశారు.  అందరూ తలో మాట అంటూ వచ్చారు.   సామ్రాట్.. కౌశల్ మీదకు వస్తూ.. ‘‘ఏమంటున్నావ్ రా కౌశల్.. మైండ్ యువర్ లాంగ్వేజ్’’ అంటూ వార్నింగ్ ఇచ్చాడు. తనీష్ సైతం ఆగ్రహంతో ఊగిపోయాడు. కుటుంబాన్ని అంతటినీ వదిలి ఇన్నాళ్లుగా ఇక్కడ బతుకుతుంటే మమ్మల్ని కుక్కులంటావా అంటూ రోల్ భావోద్వేగానికి గురయ్యాడు. 


చివరికి కౌశల్.. తన ఉద్దేశం కుక్కలను ఉదాహరణగా చెప్పడమే కానీ, మిమ్మల్ని కుక్కలు అనలేదంటూ క్షమాపణలు చెప్పాడు.  ఎవరు అతిగా స్పందించపోవడం మంచిదని గీత సూచించడంతో అంతా సుద్దుమణిగారు.   ఫినాలే రౌండ్ కోసం మంగళవారం ఎపిసోడ్‌లో నిర్వహించిన ‘మీ ఇసుక జాగ్రత్త’ టాస్క్‌ను బుధవారం కొనసాగించారు. ఈ సారి సామ్రాట్, దీప్తీ, తనీష్‌లు ఇసుకను కాపాడుకోవాలి.

గీత, రోల్, కౌశల్‌లు ఆ ఇసుకను తొలగించాలి. మంగళవారం జరిగిన రచ్చను దృష్టిలో పెట్టుకుని ఈ సారి గట్టి హెచ్చిరికలే ఇచ్చాడు బిగ్ బాస్. దీంతో అంతా జాగ్రత్తగా టాస్క్ పూర్తిచేసే ప్రయత్నం చేశారు. ఇసుక టాస్క్ గెలిచిన రోల్, రెండో టాస్క్ విజేత సామ్రాట్‌ల మధ్య పోటీ జరగనుంది. ఇందులో ఎవరు గెలిచేవారు నేరుగా ఫినాలేకు ఎంపికవుతారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: