సినిమా ఇండస్ట్రీ అంటేనే గ్లామర్ ప్రపంచం..ఇక్కడ హీరోయిన్ గా రాణించాలంటే..మడికట్టుకొని కూర్చుంటే ఛాన్సులు రావు..అందుకే దీపం ఉండగానే చక్కదిద్దుకోవాలన్న రీతిలో క్రేజ్ ఉండగానే గ్లామర్ గా నటించి నాలుగైదు ఆఫర్లు కొట్టేయాలని చూస్తున్నారు అప్ కమింగ్ హీరోయిన్లు.  పాతతరం సినిమాల్లో హావభావాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చేవారు..కానీ రాను రాను గ్లామర్ కి ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం నటన పరంగా కాకున్నా తమ అందచందాలు చూపిస్తూ కొంత మంది హీరోయిన్లు ఇండస్ట్రీలో నట్టుకొస్తున్నారు.  అలా అని అందరూ గ్లామర్ కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా నటనతో మనసులు గెలుస్తున్నారు. 

మొన్నటి వరకు తనకు గ్లామర్ పరంగా నటించడం ఇష్టం లేదని..అలాంటి ఛాన్సులు నాకు అవసరం లేదని చెబుతూ వచ్చింది  అనుపమ పరమేశ్వరన్‌.  కెరియర్‌ స్టార్ట్‌ చేసిన కొత్తల్లో గ్లామర్‌ షోకి నో చెప్పిన అనుపమకి ఈమధ్య కాలంలో వరుసగా చాలా ఫ్లాపులు తగిలాయి.  దాంతో ఇప్పుడు రూట్ మార్చినట్లు కనిపిస్తుంది.  గ్లామర్ కి నో చెప్పిన చాలా మంది హీరోయిన్లు తెరమరుగైపోయారు.  ఇండస్ట్రీలో కండిషన్లు పెడుతూ కూర్చుంటే అవకాశాలు రావని ఆమె గుర్తించింది. నిత్య మీనన్‌ లాంటి హీరోయిన్లు కనుమరుగు అయిపోయిన సంగతి కూడా గ్రహించింది.

అందుకే ఇక మీదట గ్లామర్‌ షోకి కూడా సై అంటోంది.  అలా అని నార్త్ హీరోయిన్లు మరీ స్కిన్ షో కాకుండా సాంప్రదాయంగా ఉంటూనే..కాస్త గ్లామర్ డోస్ పెంచేందుకు తయారైనట్లుంది అనుపమా పరమేశ్వరన్.  తాజాగా హీరో రామ్ నటించిన హలో గురూ ప్రేమకోసమే' టీజర్‌లో అనుపమ నడుము షో ఇప్పుడు పెద్ద హిట్‌ అయింది. లక్షల మంది ఈ టీజర్‌ని చూస్తూ తెగ లైక్‌ చేసేస్తున్నారు.  మరి ఈ రెస్పాన్స్ చూసి అనుపమ భవిష్యత్ లో మరింత గ్లామర్ డోస్ పెంచుతుందా..లేదా ఇంతటితోనే సరిపెడుతుందా చూడాలి. 


మరింత సమాచారం తెలుసుకోండి: