తెలుగు లో వస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 చివరి దశకు చేరుకుంటున్న కొద్ది అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. హౌస్ లో ఊహించని పరిణామాలు చోటు చేసుకోవడంతో తదుపరి ఎపిసోడ్ ఎలా ఉంటుంది అనే ఆసక్తి అమితంగా పెరిగింది. మంగళవారం నుంచి బిగ్ బాస్ హౌజ్ లో ఫిజికల్ కౌశల్, తనిష్ దాడి చేసుకోవడానికి కూడా ప్రయత్నించారు. నిన్నటి ఎపిసోడ్ లో కౌశల్ కుక్కల్లా తనపైకి వస్తున్నారని అనడంతో..ఇంటి సభ్యులు మొత్తం కౌశల్ పై ముకుమ్మడిగా మాటల దాడికి దిగారు.
ఇలా ఎంతో ఉత్కంఠంగా సాగుతున్న బిగ్ బాస్ విన్నరు ఎవరు అన్నది కీలకంగా మారిపోయింది. బిగ్‌బాస్ రెండో సీజన్ మొదట్లో కాస్తా నిరాశకు గురి చేసినప్పటికి, తరువాత వాటిని అధికమించి షోని సక్సెస్ చేయడంలో బిగ్‌బాస్ టీం సఫలం చెందారు.ఇక బిగ్‌బాస్ విన్నర్ ఎవరు అవుతారో అని అందరిలోను ఆసక్తి నెలకొంది. బిగ్‌బాస్ రెండో సీజన్ మొదట్లో కాస్తా నిరాశకు గురి చేసినప్పటికి, తరువాత వాటిని అధికమించి షోని సక్సెస్ చేయడంలో బిగ్‌బాస్ టీం సఫలం చెందారు.
ఇక బిగ్‌బాస్ విన్నర్ ఎవరు అవుతారో అని అందరిలోను ఆసక్తి నెలకొంది. అయితే బిగ్ బాస్ విన్నర్ ఇప్పటివరకు అందరూ కౌశల్ అనిఫిక్స్ అయ్యారు. కానీ హౌస్ లో రోజు జరుగుతున్నా గొడవలు చూస్తుంటే విన్నర్ ఎవరు అనేది ఇప్పుడే ఫిక్స్ అవ్వలేమని చెప్పొచ్చు. కానీ ఎలిమినేట అయిన పలువురు బిగ్ బాస్ కంటెస్టంట్ లు కౌశల్ గెలుస్తాడని చేసిన వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. సాధారణంగా మంచు మనోజ్ సమాజంలో జరుగుతున్న వాటిపై ఎప్పటికప్పుడు ట్వీటర్ ద్వారా స్పందిస్తుంటాడు.
తాజాగా బిగ్‌బాస్‌పై కూడా ట్వీట్ చేశాడు మనోజ్. నీ అభిప్రాయం ప్రకారం బిగ్ బాస్ విన్నర్ ఎవరనుకుంటున్నావ్..? అన్నా అని ప్రశ్నించగా.. దానికి ఎవరూ ఊహించని సమాధానం చెప్పాడు మనోజ్. తనదైన స్టైల్ లో చిలిపిగా ‘నాని’ అని ఆన్సర్ చేశారు. మనోజ్ ఇచ్చిన ఝాలక్‌తో అభిమాని కళ్లు బైర్లు కమ్మినంత పనైంది.