తెలుగు బుల్లితెరపై వస్తున్న బిగ్ బాస్ సీజన్ 2 లో భాను శ్రీ తెగ హడావుడి చేసిన విషయం తెలిసిందే.  తెలంగాణ యాసతో మాట్లాడుతూ..కరుకైన గొంతుతో అందరినీ ఆకట్టుకుంది.  సాధారణంగా  ఒక షో సక్సెస్ అయితే హిట్ అంటారు.. రెండో సీజన్ కూడా హిట్ అయితే సూపర్ హిట్ అంటారు. కాని చేసిన ప్రతి సీజన్ సక్సెస్ కొడితే అది ‘ఢీ’ అంటారు అంటూ ‘ఢీ జోడీ’ 11 సీజన్‌ను మొదలుపెట్టేశారు యాంకర్ ప్రదీప్.   నటిగా ఎన్ని సినిమాలు చేసినా రాని గుర్తింపు బిగ్ బాస్ 2 లో కంటెస్టెంట్ గా ఎంపికై తెచ్చుకుంది భానుశ్రీ.

మొదట్లో హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న భాను.. కౌశల్ పై చేసిన కామెంట్స్ కారణంగా ఆడియన్స్ లో ఆమెపై వ్యతిరేకత ఏర్పడింది. దీంతో ఆమె ఎలిమినేట్ కాక తప్పలేదు.  బుల్లితెరపై వరుసగా 10 సీజన్‌ల పాటు తిరుగేలేని డాన్స్ షోగా ఎన్టీఆర్, బన్నీ, నాని, రాజమౌళి, ప్రభాస్ లాంటి స్టార్లు అతిథులుగా విచ్చేసిన మోస్ట్ ఎంటర్‌టైనర్ డాన్స్ షో ‘ఢీ 11’ ప్రారంభమైంది.   మొదట ఎపిసోడ్ లోనే టీమ్ లీడర్ గా ఎంట్రీ ఇచ్చిన భానుశ్రీ.. తన డైలాగ్స్ తో మరో టీమ్ లీడర్ సుడిగాలి సుధీర్ ని ఆడేసుకుంది.

నీ మీద పడి అరవడానికి రష్మిని కాదు.. నీ వెనుక పడి బ్రతిమిలాడటానికి వర్షిణిని కాదు.. భాను.. బాక్స్ బద్దలైపోద్ది'' అంటూ తనదైన డైలాగ్స్ తో ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. అయితే ఈ షో యూట్యూబ్ లో పెట్టిన కొద్ది గంటల్లోనే 11 లక్షల మంది వీక్షించారు. ఇక యాంకర్‌గా ప్రదీప్, న్యాయనిర్ణేతలుగా శేఖర్ మాస్టార్ , ప్రియమణిలు వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే.   

నెటిజన్లు మాత్రం భాను గొంతుని వినలేకపోతున్నాం బాబోయ్.. ఆమెను తీసేసి రష్మిని పెట్టండి అంటూ కామెంట్లు చేస్తున్నారు. దీనిపై స్పందించిన భాను.. మీకు ఇష్టం లేకపోతే లైక్, కామెంట్ చేయొద్దని.. అంతేకాని ఇలా తన గొంతుపై విమర్శలు చేయడం సరికాదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.  మరి ముందు ముందు ఈ అమ్మడికి ఉన్న కోపానికి ఢీ జోడీలో ఎలా రాణిస్తుందో వేచి చూడాలి అని అంటున్నారు నెటిజన్లు. 


మరింత సమాచారం తెలుసుకోండి: