ఈ మద్య బాలీవుడ్ హీరోయిన్ తమ హాట్ ఫోటో షూట్స్ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ విపరీతమైన లైక్స్ తెచ్చుకుంటున్నారు. తాజాగా బాలీవుడ్ నటి దిశాపటాని రెడ్ కలర్ బికినీలో ఫోటోలకి ఫోజులిచ్చింది. పచ్చని చెట్ల మధ్య నిల్చుని ఇచ్చిన ఫోజ్ సూపర్‌గా ఉంది. రెడ్ కలర్ బికినీలో కుర్రాళ్ల మతులు పోగొడుతుంది. తన అందమైన శరీరాకృతిని బికినీలో ప్రదర్శించడానికి ఏ మాత్రం వెనుకాడదు దిశా పటానీ.
ప్రత్యేకించి ఈమె ఇన్‌స్టాగ్రమ్ అకౌంట్ లో తరచూ ఈ తరహా గ్లామరస్ పిక్స్ పోస్ట్ అవుతూ ఉంటుంది. క్రమం తప్పకుండా తన ఫాలోయర్స్ కు ఈ తరహా హాట్ పిక్స్‌ను అందిస్తూ ఉంటుంది. చిరునవ్వులు చిందిస్తూ.. అందాలను ఆరబోస్తూ.. చాలా సహజంగా ఇచ్చిన ఈ స్టిల్‌ను పోస్టు చేసింది. ఇన్‌స్టాగ్రమ్‌లో దిశాకు బీభత్సమైన స్థాయిలో ఫాలోయింగ్ ఉంది. 13 మిలియన్ల మంది ఫాలోయర్లున్నారు.
తాజాగా ఈ ఫోటో చూసి నెటిజన్లు మైమరిచిపోతూ..దిశా అందానికి ఫిదా అయ్యారు. సోషల్ మీడియాలో కామెంట్లు, లైకుల రూపంలో తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు.