టాలీవుడ్ లో విలక్షన నటుడిగా..దర్శకుడిగా పేరు తెచ్చుకున్న రవిబాబు కాస్త డిఫరెంట్ గా ఆలోచించి పంది పిల్లపై అదుగో అనే సినిమా తెర‌కెక్కించిన సంగ‌తి తెలిసిందే.  ఈ సినిమా దసరా కానుకగా రిలీజ్ చేయబోన్నారు.  మొదటి సారిగా లైవ్ ఎనిమల్ తో నటింపచేసి వినూత్నమైన హాస్యాన్ని పండించనున్నారట రవిబాబు.  ఇటీవ‌ల విడుద‌లైన టీజ‌ర్ అభిమానుల‌లో చిత్రంపై ఆస‌క్తిని క‌లిగించింది. ఇండియ‌న్ సినిమా చ‌రిత్రలోనే తొలి సారి పూర్తిస్థాయి లైవ్ యాక్షన్ 3డి యానిమేష‌న్‌తో రూపొందుతున్న ఈ సినిమాని రవిబాబు స్వయంగా తన సొంత నిర్మాణ సంస్థ ఫ్లైయింగ్‌ ఫ్రాగ్స్‌ బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు. 

ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సి ఉన్నా కొన్ని సాంకేతిక పరమైన కారణాల వల్ల ఆలస్యం అయ్యిందని రవిబాబు తెలిపారు.  ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక సినిమాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు.  గతంలో ఎస్ ఎస్ రాజమౌళి హీరోలేకుండా కేవలం ఒక్క ఈగతో సినిమాను రక్తి కట్టించారు.  ‘ఈగ’లాంటి సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నారు.  కంటెంట్ బాగుంటే..పెద్ద నటులు అవసరం లేదని ఈ సినిమా రుజువు చేసింది. 

‘అదుగో’ సినిమాలో అభిషేక్, నాభ లు చిత్రంలో కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రానికి నిర్మాత సురేష్ బాబు స‌మ‌ర్ప‌కుడిగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. తెలుగుతో పాటు అన్ని భారతీయ భాషల్లో ఈ చిత్రం విడుద‌ల కానుంది. ప్ర‌శాంంత్ విహారీ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు, సుధాకర్ రెడ్డి సినిమాటోగ్రాఫ‌ర్‌గా వ్య‌ వ‌హ‌రించారు.  తాజాగా  సినిమాకి సంబంధించిన తొలి సాంగ్‌ని తాజాగా విడుద‌ల చేసింది చిత్ర యూనిట్ . స్టూపిడ్ స్టూపిడ్ అంటూ సాగే ఈ పాట‌కి భాస్క‌ర‌బ‌ట్ల లిరిక్స్ అందించ‌గా, రిద్ది పాట పాడారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: