బాలీవుడ్ లో ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలు తెరకెక్కించిన  యశ్ రాజ్ ఫిల్మ్స్ సంస్థ నుంచి వస్తున్న మరో ప్రతిష్ఠాత్మక సినిమా ‘థగ్స్ ఆఫ్ హిందుస్థాన్’. ఆమీర్ ఖాన్ హీరోగా నటిస్తున్నఈ సినిమాలో బాలీవుడ్ బిగ్ బీ అమితాబ్ కీలక పాత్ర పోషిస్తున్నారు. కత్రినాకైఫ్, ఫాతిమా సనాషేక్  హీరోయిన్లు నటిస్తున్నారు. విల‌న్‌గా  లార్డ్‌ జాన్‌ క్లైవ్‌ పాత్రలో బ్రిటిష్‌ నటుడు లాయిడ్‌ ఒవెన్‌ నటిస్తున్నారు. 1839లో వచ్చిన ‘కన్ఫెషన్స్‌ ఆఫ్‌ థగ్‌’ నవల ఆధారంగా భారీ పీరియాడికల్‌ చిత్రంగా దీన్ని తెరకెక్కిస్తున్నారు. ‘ధూమ్‌ 3’ దర్శకుడు విజయ్‌ కృష్ణ ఆచార్య దర్శకుడు. ప్రధాన పాత్రధారుల ఫస్ట్‌లుక్‌లను వరుసగా విడుదల చేస్తున్నారు. 


ఈ సినిమా నుంచి ఫాతిమా ఫస్ట్‌ లుక్‌ను విడుదల చేసింది చిత్రబృందం. ఆమె యుద్ధభూమిలో ధైర్యంగా పోరాడుతున్న మహిళగా కనిపించి, ఆకట్టుకున్నారు. శత్రువులపైకి బాణం విసురుతున్నారు. ఇందులో ఆమె ‘జఫీరా’ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర బృందం వెల్లడించింది. కమాండర్ ఖుదాబక్ష్ పాత్రలో అమితాబ్ లుక్‌ని రీసెంట్‌గా విడుద‌ల చేసిన టీం సినిమాపై భారీ ఆస‌క్తి క‌లిగించింది. విలన్ జాన్ క్లైవ్ ల లుక్‌లు ఆకట్టుకుంటున్నాయి. 

Image result for థ‌గ్స్ ఆఫ్ హిందుస్థాన్‌

తాజాగా  క‌త్రినా కైఫ్ లుక్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది.. సూరియాగా ఆమెను ప‌రిచ‌యం చేశారు.. గ్లామ‌ర్ తో ఆమె లుక్ అంద‌ర్న ఆకట్టుకునేలా ఉంది. దీపావళి కానుకగా ఈ చిత్రాన్ని నవంబరు 8న విడుదల చేస్తున్నారు.


300 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్న ఈ సినిమాను ఆదిత్య చోప్రా, ఆమిర్‌ఖాన్ నిర్మిస్తున్నారు. దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మరాఠీ చిత్రం సైరట్‌కు సంగీతం అందించిన అజయ్-అతుల్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: