ఒక్క టీజర్ లో కన్నుగీటిన భామ ప్రపంచ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది.  నేషనల్ క్రష్.. ప్రియా వారియర్ ఎంతటి క్రేజ్ సంపాదించుకుందో తెలిసిందే. మలయాళ సినిమా ‘ఒరు అదార్ లవ్’ సినిమాలో కన్ను గీటే సన్నివేశంతో కుర్రాకారును మనసు దోచుకున్న ఈ చిన్నది.. తాజాగా మరో పాటలో మెరిసింది. సినీ, రాజకీయ, క్రీడా రంగానికి చెందిన వారు ఈ కుర్రదానికి ఫిదా అయ్యారు.  ఆమె ఎక్స్‌ప్రెషన్స్ చూసి దేశమంతా ఫిదా అయింది. కొన్నాళ్ల పాటు ఇంటర్నెట్ సెన్సేషన్‌గా నిలిచింది.   

తాజాగా అదే మూవీలోని మరో సాంగ్ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.  ఊహించినట్లే ఈ పాటకు కూడా విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది. కేవలం 15 గంటల్లోనే పది లక్షలకుపైగా వ్యూస్ వచ్చాయి. ముఖ్యంగా కేరళ యూత్‌ను ఈ పాట బాగా ఆకట్టుకుంది. అయితే ఇప్పుడీ పాటే ప్రియా ప్రకాశ్ పరువు తీసింది. ‘ఫ్రీక్ పెన్నే’ అనే ర్యాప్ సాంగ్‌లో ఆడిపాడింది. అయితే, ఈ పాటకు లైక్స్ అంటే, డిస్‌లైక్స్ ఎక్కువ వస్తున్నాయి. ఈ మధ్య కాలంలో మోస్ట్ డిస్‌లైక్స్ వచ్చిన వీడియోగా ఈ పాట నిలిచింది.

లైక్స్ కేవలం 39 వేలు ఉండగా.. డిస్‌లైక్స్ మాత్రం మూడు లక్షల వరకు రావడం మూవీ యూనిట్‌కు మింగుడు పడటం లేదు.  ఒమర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సన్నివేశాలు, పాటలు ఇప్పటి వరకు బాగానే ఆధరణ పొందాయి. అయితే, తాజాగా విడుదలైన ‘ఫ్రీక్ పెన్నే’ పాట మాత్రం ఎవరికీ నచ్చడం లేదు. 

అలాగే, గత వీడియోల్లో ప్రియా వారియార్‌లో కనిపించిన మ్యాజిక్ ఈ పాటలో మిస్సయ్యిందని మరికొందరు భావిస్తున్నారు. ఇవన్నీ పక్కన పెడితే.. సాంగ్ మాత్రం చాలా అందంగా, కలర్‌ఫుల్‌గా చిత్రించారు. ఈ ఏడాది క్రిస్ట్‌మస్ పురస్కరించుకుని ఈ సినిమా విడుదల కానుంది.ప్రియా వారియర్‌ను లక్ష్యంగా చేసుకునే ఈ డిస్‌లైక్స్ వస్తున్నట్లు కామెంట్లను పరిశీలిస్తే తెలుస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: