మాలీవుడ్ లో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న దిలీప్ ఆ మద్య భావన కేసులో జైలుకు వైళ్లి వచ్చిన సంగతి తెలిసిందే. తనపై లైంగిక వేధింపులకు చేయించారని ఆమె ఫిర్యాదు మేరకు దిలీప్ ఈ కేసులో ప్రమేయం ఉందన్న కారణంతో ఆయనను జైలుకు పంపించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కోర్టు ఆయనకు బెయిల్ మంజూరు చేసింది.
తాజాగా మలయాళ స్టార్ హీరో దిలీప్ మరోసారి తండ్రి కాబోతున్నారు. దిలీప్ భార్య..నటి కావ్య మాధవ్ త్వరలో ఓ బిడ్డకు జన్మనివ్వబోతుందట. తాజాగా ఆమె పోస్ట్ చేసిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా, కోలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన చిత్రాల్లో నటించిన దిలీప్ కి 18 ఏళ్ల కూతురు మీనాక్షి ఉన్నారు.
నటి కావ్య 2009లో నిశాల్ చంద్రను వివాహం చేసుకున్నారు. వారి మద్య అభిప్రాయ భేదాలు రావడంతో 2011లో ఆమె విడాకులు తీసుకున్నారు. ఆతర్వాత దిలీప్, కావ్యల మద్య ప్రేమ చిగురించి పెళ్లికూడా చేసుకున్నారు. తొలి బిడ్డకు జన్మనివ్వబోతున్నందుకు కావ్య చాలా సంతోషంగా ఉన్నారు.