ఈ మద్య కొన్ని సినిమాల్లో ముందుగా కాంట్రవర్సీ సృష్టించి ఆ తర్వాత సారీ అని చెప్పడం కామన్ అయ్యింది. అది డైలాగ్స్ కావొచ్చు..పాటలు కావొచ్చు...కొంత మంది మనోభావాలు దెబ్బతిన్నాయని తెరపైకి వచ్చిన తర్వాత అయో సారీ అంటూ వాటిని తొలగించేస్తున్నారు. తాజాగా ఇలాంటి తప్పిదమే జరిగింది..నిన్న రిలీజ్ అయిన ‘ఈమాయ పేరేమిటో’సినిమా విషయంలో..అయితే తాము కావాలని చేసిన అనుకోకుండా జరిగిందని చిత్ర యూనిట్ బహిరంగాంగానే క్షమాపణలు చెప్పారు.
రాము కొప్పుల దర్శకత్వంలో..రాహుల్ విజయ్, కావ్యా థాపర్ జంటగా నటించిన చిత్రం ‘ఈమాయ పేరేమిటో’. ఈ సినిమాకు దివ్య విజయ్ నిర్మాతగా వ్యవహరించారు. చిత్రంలోని ఓ సాంగ్‌లో రెండు, మూడు లైన్స్ జైన మతస్థులు ఆరాధించే మంత్రాన్ని కించపరిచేలా ఉన్నాయని భావించి.. తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల నిరసనలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ మీడియా సమావేశంను ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఫైట్ మాస్టర్ విజయ్ మాట్లాడుతూ..మా అబ్బాయి రాహూల్ విజయ్ హీరోగా..మా అమ్మాయి దివ్య విజయ్ నిర్మాతగా తెరకెక్కిన ‘ఈమాయ పేరేమిటో’ సినిమాకు పాజిటివ్ టాక్ రావడంతో చాలా హ్యాపీగా అనిపించింది.
అయితే ఈ సినిమాలో ఒక పాట విషయంలో విమర్శలు వస్తున్నాయి..కొందరిని ఇబ్బంది పెట్టేలా సినిమా తీయాలనేది మా ఉద్ధేశ్యం కాదు. ఈ సినిమాలోని పాటలో ఉన్న కొన్ని లైన్లు.. కొందరి మనోభావాలకు ఇబ్బంది కలిగించేవిగా ఉన్నాయని తెలిసింది. వెంటనే వాటిని తొలగించాలని మేము నిర్ణయం తీసుకున్నాం. నేనే కాదు.. మా ఫ్యామిలీలో ఎవరైనా అలాంటి పని చేస్తే నేను క్షమించను. ఒక కమ్యూనిటీ విషయంలో మేం కావాలని తప్పు చేయం. ఎక్కడో మిస్ కమ్యూనికేట్ అయ్యింది. అందరినీ మనస్ఫూర్తిగా క్షమాపణలు కోరుతున్నాం. తెలియక జరిగిన తప్పుకు క్షమించమని వేడుకుంటున్నాను...అన్నారు.