నాగార్జున నానీల కాంబినేషన్ లో వచ్చిన ‘దేవదాస్’ టాక్ విషయంలోనే కాకుండా కలక్షన్స్ విషయంలో కూడ విచిత్రమైన పరిస్థితి ఎదుర్కుంటోంది. ఈమూవీ విడుదలకు ముందు ప్రమోషన్ విషయంలో చేసిన హడావిడి ఇప్పుడుపెద్దగా కనిపించకపోవడం ఈమూవీని భారీ రేట్లకు కొనుక్కున్న బయ్యర్లను కలవర పెడుతున్నట్లు టాక్.
ఈమూవీ విడుదలై అప్పుడే నాలుగు రోజులు గడిచిపోయినా ఈమూవీ విడుదల తరువాత వచ్చిన డివైడ్ టాక్ ను వ్యూహాత్మకంగా తిప్పి కొట్టడంలో ఈమూవీ నిర్మాతలు ఫెయిల్ అవ్వడానికి గల కారణం ఈమూవీ హీరోలు అంటున్నారు. నాని ‘బిగ్ బాస్ 2’ ఫైనల్ షోలో బిజీ అయిపోతే నాగార్జున ఈసినిమా ఫలితం తనకు సంబంధమే లేదు అన్నట్లుగా విదేశాలు వెళ్ళిపోవడం మరింత ఆశ్చర్యకరంగా మారింది.
ప్రస్తుతం నాగార్జున స్పెయిన్ సమంత చైతూల మొదటి వివాహ వార్షికోత్సవం కోసం అంటూ చాలముందుగానే స్పెయిన్ కు వెళ్ళిపోవడంతో ‘దేవదాస్’ ఫలితం గురించి నాగార్జున ఏమాత్రం ఆసక్తి కనపరచడం లేదా అన్న గాసిప్పులు వినపడుతున్నాయి. దీనితో నాగార్జునకు ఈచిత్ర యూనిట్ సభ్యులకు ఏదోగ్యాప్ వచ్చింది అంటూ విపరీతంగా వార్తల హడావిడి చేస్తున్నాయి. ఈ సినిమాకు టాక్ బాగానే వచ్చినప్పటికీ ఈమూవీ పెరిగి పోయిన భారీ అంచనాలకు తగ్గట్టుగా లేకపోవడంతో ఈమూవీ విడుదలైన రెండవ రోజు కలక్షన్స్ లో భారీ డ్రాప్ కనిపించింది అన్నవార్తలు వస్తున్నాయి.
![Devadas movie review Nani Nagarjuna](https://images.indianexpress.com/2018/09/devadas-759.jpg)
హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో ఒక మోస్తరు సినిమాలు ప్రదర్శించే ధియేటర్లకు వచ్చే స్థాయిలో ‘దేవదాస్’ రెండవ రోజు కలక్షన్స్ లేవు అని అంటున్నారు. నిన్న శనివారం ఈరోజు ఆదివారం కాబట్టి వీకెండ్ వల్ల ‘దేవదాస్’ కలక్షన్స్ కు సమస్యలు లేకపోయినా రేపటి నుండి ఈమూవీకి అసలు పరీక్ష మొదలవుతుంది అని టాక్. ఇలా ఉండగా ఈమూవీ ఎడిటింగ్ లో చేసిన హడావిడి వల్ల ఇది కొన్ని సీన్లు కట్ చేయడం వల్ల జంపింగ్ లు ఎక్కువగా కనిపిస్తున్న నేపధ్యంలో దాన్ని సవరించడానికి చిత్రబృందం ఇప్పుడు రంగంలోకి దిగినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా ఈమూవీ ద్వితీయార్థంలో రెండు కొత్త సన్నివేశాలు కలపాలని చిత్రబృందం భావిస్తోంది. అయితే ఈనష్ట నివారణ చర్యలు ఇప్పటికే డివైడ్ టాక్ తెచ్చుకున్న ‘దేవదాస్’ ను ఎంత వరకు రక్షిస్తాయో చూడాలి..