‘అరవింద సమేత’ మూవీకి అత్యంత కీలకంగా మారిన పెనివిటి సాంగ్ కు సంబంధించి ఈరోజు ప్రోమోను విడుదల చేసారు. ఇప్పటికే అన్ని చోట్ల హోరెత్తి పోతున్న ఈపాట చిత్రీకరణ విషయంలో ఎవరి అంచనాలు వారికి ఉన్నాయి. రామ జోగయ్య శాస్త్రి అద్భుతంగా వ్రాసిన ఈపాటకు సంబంధించిన ప్రోమోను చూసిన వారు షాక్ అవ్వడమే కాకుండా ఈపాటను జూనియర్ పై చిత్రీకరించిన త్రివిక్రమ్ టేకింగ్ ను నిరసిస్తూ విపరీతమైన నెగిటివ్ కామెంట్స్ పెడుతున్నారు.
వాస్తవానికి ఈపాటకు సంబంధించిన చిత్రీకరణ చాల ఎమోషనల్ గా ఉంటుంది అని అందరూ భావిస్తే దానికి భిన్నంగా ఈపాటలో ఎన్టీఆర్ చిన్నచిన్న స్టెప్స్ వేస్తూ ఒక డ్యూయెట్ సాంగ్ లా జూనియర్ నటించిన తీరు చూసి అందరు ఆశ్చర్యపోతూ త్రివిక్రమ్ కు ఏమైంది అంటూ ఘాటైన కామెంట్స్ చేస్తున్నారు. మరి కొందరైతే ఈమూవీ గురించి భారీ అంచనాలు పెంచుకోవడం అనవసరమనీ ఈ ప్రోమోసాంగ్ ‘అరవింద సమేత’ పై ఉన్న అంచనాలు అన్నీ నీరు గార్చింది అంటూ త్రివిక్రమ్ ను టార్గెట్ చేస్తూ కామెంట్స్ పెడుతున్నారు.
ఈవిషయాలు అన్నీ జూనియర్ దృష్టికి వచ్చినట్లుఉన్నాయి అందుకే అంటే ‘అరవింద సమేత ఫలితం ఎలా వున్నా మంచి చెడు ఈరెండు ఫలితాలకు త్రివిక్రమ్ మాత్రమే కారకుడు అన్న అర్ధం వచ్చేలా జూనియర్ మీడియా సంస్థలకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో కామెంట్స్ చేస్తున్నారు. తాను ఈమూవీ కోసం సిక్స్ ప్యాక్ చేయడం కూడా త్రివిక్రమ్ కోరిక అని లావుగా ఉన్న తనను కాస్త తగ్గాలని కోరడంతో పనిలో పనిగా సిక్స్ ప్యాక్ చేసేసానని ఎన్టీఆర్ అంటున్నాడు.
అంతేకాదు ఈమూవీలో తన మార్క్ యాక్షన్ సీన్స్ కన్నా త్రివిక్రమ్ మార్క్ ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉంటాయని ఈవిషయాల పై తాను అన్ని నిర్ణయాలు త్రివిక్రమ్ కే వదిలేసాను అని అంటున్నాడు. అంతేకాదు ఈమూవీలో అనేక సర్ ప్రైజింగ్ ఎలిమెంట్స్ ఉంటాయి అని జూనియర్ చెపుతున్న మాటలు బట్టి త్రివిక్రమ్ జూనియర్ పై ఈసినిమాలో ఇంకా ఎన్ని ప్రయోగాలు చేసాడో అని జూనియర్ అభిమానులే భయపడి పోతున్నట్లు టాక్..