‘బిగ్ బాస్ 2’ విన్నర్ తన సక్సస్ ను తన కౌశల్ ఆర్మీతో ఎంజాయ్ చేస్తూ మన తెలుగు రాష్ట్రాలలోని ప్రధాన నగరాలు అన్నీ చుట్టేస్తూ తన భవిష్యత్ వ్యూహాలకు సంబంధించి ఆలోచనలు చేస్తున్నాడు. ఇలాంటి పరిస్థుతులలో లేటెస్ట్ గా కౌశల్ విశాఖపట్నం వెళ్ళినప్పుడు అతడిని కలిసిన ఒక మీడియా సంస్థ ప్రతినిధితో మాట్లాడుతూ ‘బిగ్ బాస్ 2’ విషయాలను షేర్ చేయడమే కాకుండా మధ్యలో ఎవరూ ఊహించని విధంగా ఉదయ్ కిరణ్ ప్రస్తావన తీసుకు వచ్చి ఏకంగా ఆమీడియా సంస్థ ప్రతినిదికే షాక్ ఇచ్చాడు. 
bigg boss winner kaushal about boyapati movie offer
తనకు ఫిలిం ఇండస్ట్రీలో చాలమందితో పరిచయాలు ఉన్నా తనకు ఉదయ్ కిరణ్ తో ఉన్న సాన్నిహిత్యం గురించి గుర్తుకు చేసుకుంటూ అతడు మరణించి సంవత్సరాలు గడిచిపోతున్నా అతడి జ్ఞాపకాలు తనను వెంటాడుతూనే ఉన్నాయి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసాడు. గతంలో తాను సినిమాలలో చిన్నచిన్న పాత్రలు నటించే పరిస్థుతులలో తాను ఉదయ్ కిరణ్ తో కలిసి విశాఖపట్నం బుల్లయ్య్హా కాలేజీలో ‘మనసంతా నువ్వే’ షూటింగ్ సమయంలో తాను ఉదయ్ కిరణ్ ను కలిసిన పరిస్తుతులను వివరిస్తూ అప్పట్లో తాను చాల చిన్న నటుడునే అయినా ఉదయ్ కిరణ్ తన పట్ల ఎంతో గౌరవంగా వ్యవహరించాడని అలాంటి సంస్కారిని తాను ఇండస్ట్రీలో ఇప్పటి వరకు చూడలేదు అంటూ కామెంట్స్ చేసాడు. 
kaushal army hungama at bigg boss2 sets
‘మనసంతా నువ్వే’ సినిమాలో తాను కూడ కలిసి నటించడంతో తనను ప్రోత్సహిస్తూ తనకు సుమారు 8 సినిమాలలో అవకాశాలు ఇప్పించిన విషయాలను గుర్తు చేసుకుంటూ తాను ఉదయ్ కిరణ్ తో కలిసి విశాఖపట్నం గోవా లోని అనేక ప్రాంతాలలో కలిసి తిరిగిన విషయాలను బయటపెట్టాడు కౌశల్. అంతేకాదు ఉదయ్ కిరణ్ లాంటి మంచి నటుడు దూరం కావడం ఇండస్ట్రీ దురదృష్టం అంటూ కౌశల్ చెప్పిన మాటలు మళ్ళీ ఉదయ్ కిరణ్ మ్యానియాను గుర్తుకు వచ్చేలా చేస్తున్నాయి.
geetha madhuri targets kaushal, who is bigg boss title winner
కౌశల్ కు ఏర్పడిన క్రేజ్ తో ఇప్పటికే దర్శకుడు మారుతి మరియు బోయపాటిలు తాము తీస్తున్న సినిమాల విషయంలో సంప్రదింపులు జరుపుతూ ఉన్నా కౌశల్ సినిమా అవకాశాల గురించి కాకుండా తన కౌశల్ ఆర్మీ పటిష్టత గురించి వ్యూహాలు రచిస్తున్నాడు. అంతేకాదు తన కౌశల్ ఫౌండేషన్ కు విరాళాలు సేకరిస్తూ రాబోతున్న ఎన్నికల్లో పోటీ చేయాలని తన మనసులోని మాటను పరోక్షంగా చెపుతున్న కౌశల్ ఎత్తుగడలు చాల భారీ స్థాయిలో ఉన్నాయి అనడంలో ఎటువంటి సందేహం లేదు..  


మరింత సమాచారం తెలుసుకోండి: