అందాల తార అనుష్క షెట్టి వివాహంపై రోజుకో రూమర్ వస్తుంది. మొన్నటికి మొన్న అనుష్క ఇటలీలో ఉన్న ప్రభాస్ ను కలిసినట్లు ఊహాత్మక కథనాలు వెలుగులోకి వచ్చాయి. వారిద్ధరూ కలసి తాము ఎప్పటికి స్నేహితులమేనని చెప్పినా పలుమార్లు ఆ విషయంపై వస్తున్న వార్తలను ఖండించినా కూడా ఈ పుకార్లకు పుల్-స్టాప్ పడటం లేదు.
అనుష్క ఈ మద్య తన వెయిట్-లాస్ కావటానికి ఆస్ట్రియాకు వెళ్ళిన వార్తలు వచ్చాయి. అయితే ఆస్ట్రియాకు ఇటలీకి మధ్యదూరం జస్ట్ 400 మైల్స్ కాబట్టి తన స్నేహితుడు ప్రభాస్ అక్కడ కోత్త సినిమా షూటింగ్ లో ఉండటంతో కలవటానికి వెళ్ళగా దానిపై కూడా రూమర్స్ కంటిన్యూ అయ్యాయి.
అయితే మరో సంచలన వార్త అనుష్క విషయంలో చిత్రపురిలో వినిపిస్తుంది. ఈ ఏడాది అంతా కుటుంబ సభ్యులతో గుళ్ళు గోపురాల చుట్టూ తిరిగిన అనుష్క తను 36వ సంవత్సరంలో అడుగుబెడుతున్న దృష్యా తను వివాహానికి సిద్ధమైనట్లు ప్రచారం అవుతుంది.
ఆమె ఒక కేంద్రమంత్రి కుమారునితో ప్రేమలో ఉన్నట్లు ప్రచారమౌతుంది. అనుష్క కుటుంబం ఆమెకు ఈ సంవత్సరమే అతనితో పెళ్ళి తిరుపతిలో చేసేయ్యాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం. అయితే ఎవరా కేంద్ర మంత్రి ఆయన కుమారుని వివరాలు తేలవలసి ఉంది.