ప్రిన్స్ మహేష్ బ్రాండ్ ఎండార్స్ మెంట్స్ వెనుక నమ్రత ముంబాయి పరిచియాలు ఎంతగానో సహకరిస్తున్నాయి అన్నవార్తలు ఇప్పటికే ఉన్నాయి. ఇలాంటి పరిస్థితులలో నమ్రత మరో అడుగు ముందుకు వేసి కొత్తవారిని ప్రోత్సహించే ఉద్దేశ్యంతో మహేష్ బాబు ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ లో నమ్రత చిన్నచిత్రాలను తెరకెక్కించేందుకు ప్లాన్ సిద్ధం చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే నమ్రత పలు కథలు వినడంతో పాటు కొందరు కొత్త దర్శకులకు ఆమె అడ్వాన్స్ లు కూడా ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు నమ్రత తన బ్యానర్ లో మొదటగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ‘అంత:పురం’ మూవీ తరహాలో ఉండే కథతో సినిమాను నిర్మించేందుకు రంగం సిద్దం చేసి కున్నట్లు వార్తలు వస్తున్నాయి.
అంతేకాదు నమ్రత నిర్మించబోతున్న సినిమాలో మహేష్ గెస్ట్ రోల్ పోషించబోతున్నాడనే వార్తలు ఇప్పడు ఇండస్ట్రీ వర్గాలలో విపరీతంగా హడావిడి చేస్తున్నాయి. పేరుకు ఈసినిమా చిన్న సినిమా అయినప్పటికీ ఈసినిమాలో ఒక కీలక పాత్రగా మహేష్ దాదాపుగా 30 నిమిషాల పాటు కనిపిస్తాడని సమాచారం. నమ్రత నిర్మాతగా మారి తీస్తున్న మొదటి సినిమా కావడంతో తన సపోర్ట్ కూడ లభిస్తే నమ్రత నిర్మించబోతున్న చిన్నసినిమా పెద్ద సినిమాగా మారి క్రేజ్ ఏర్పడటమే కాకుండా ఈమూవీ బిజినెస్ కూడ బాగా జరుగుతుందని నమ్రత నమ్మకం అని అంటున్నారు.
ఈచిత్రం కోసం కొత్త నటీనటులను ఎంపిక చేసే పక్రియ కూడా ప్రారంభం అయినట్లుగా తెలుస్తోంది. అయితే ప్రస్తుతం మహేష్ తన ‘మహర్షి’ ని పూర్తి చేసే పనిలో బిజీగాఉన్న నేపధ్యంలో ఈమూవీ నిర్మాణ పనులు పూర్తి అయ్యాక సుకుమార్ తో మహేష్ నటించబోయే సినిమాకు ముందు మహేష్ నమ్రత సినిమాకు సంబంధించిన షూటింగ్ లో పాల్గొంటాడని వార్తలు వస్తున్నాయి. త్వరలోనే ఈవిషయానికి సంబంధించి ఒక క్లారిటీ వస్తుంది అని అంటున్నారు..