సినిమా ఇండస్ట్రీలో ఈ మద్య వారసుల జోరు కొనసాగుతుంది.  ఒకప్పుడు స్టార్ హీరోలుగా ఉన్నవారు ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడుతున్నారు.  వారి వారసులు హీరోలుగా రాణిస్తున్నారు.  అయితే బాలీవుడ్ లో ఇప్పటి వరకు స్టార్ హీరోల వారసులే కాదు కూతుళ్లు కూడా ఎంట్రీ ఇస్తూ తమ సత్తా చాటుతున్నారు.  ఈ నేపథ్యంలో రణదీర్ కపూర్ కూతుళ్లు కరిష్మా కపూర్, కరీనా కపూర్ లు హీరోయిన్లు గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.  అనీల్ కపూర్ కూతురు సోనమ్ కపూర్, శత్రుఘ్న సిన్హా కూతురు సోనాక్షీ సిన్హా హీరోయిన్ గా పలు సినిమాల్లో నటించింది. 
Image result for pooja bedi daughter
ప్రస్తుతం సయీఫ్ అలీఖాన్ కూతురు  సోహా అలీఖాన్ కూడా హీరోయిన్ గా నటిస్తుంది.  విశ్వనటుడు కమల్ హాసన్ కూతుళ్లు శృతి హాసన్, అక్షర హాసన్ హీరోయన్లు గా నటిస్తున్నారు. తాజాగా ఇండస్ట్రీకి మరో హీరోయిన్ కూతురు పరిచయం కాబోతుంది.   ఒకప్పుడు బాలీవుడ్ లో హాట్ బ్యూటీగా పేరు తెచ్చుకున్న పూజా బేడీ  తన కూతురు ఆలియా ఫర్నిటర్వాలా 'జవానీ జానెమన్' సినిమా ద్వారా బాలీవుడ్ కి పరిచయం చేయనుంది. 
Pooja Bedi’s daughter Aalia Furniturewalla to make her Bollywood debut?
ఆ మద్య ఆలియా ఫర్నిటర్వాలా ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హడావుడి చేశాయి.   'జవానీ జానెమన్' సినిమా  తండ్రీ కూతుళ్ల అనుబంధానికి సంబంధించిన కథ. ఈ సినిమాలో ఫర్ని టర్వాలాకి తండ్రి పాత్రలో సైఫ్ అలీఖాన్ కనిపించనున్నాడు.  త్వరలో ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లబోతుందట.  అయితే తన మొదటి సినిమా సెంటిమెంట్ తో ప్రారంభిస్తున్నా..సోషల్ మీడియాలో మాత్రం  ఆలియా ఫర్ని టర్వాలా కు హాట్ బేబీ అని పేరు వచ్చింది.  


మరింత సమాచారం తెలుసుకోండి: