టాలీవుడ్ దిగ్దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి సామర్ధ్యమేమిటో అందుబాటులో ఉన్న సాంకేతిక సదుపాయాలని ఆయన తన సినిమాల్లో ఎలా వినియోగించుకుంటారో తెలుగు వాళ్ళకే కాదు భారతీయులందరికి కూడా కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. రామ్ చరణ్, ఎన్టీఆర్ తో రాజమౌళి సినిమా చేస్తున్నారని ప్రకటించగానే మొదలెట్టని సినిమాకే అంచనాలు తారస్థాయికి చేరిపోయాయి. నింగినంటిన ఆ అంచనాలకు తగినట్లుగానే, ఈనెల 11న RRR వర్కింగ్ టైటిల్ తో చిత్రనిర్మాణాన్ని లాంఛనంగా మొదలెట్టారు.
సినీ పరిశ్రమకు చెందిన పెద్దలందరినీ ఈ ప్రారంభ వేడుకకు ఆహ్వానించడంతో ఈ సినిమాకి మరింత ప్రచారం లభించింది. ఇటీవలే రెగ్యులర్ షూటింగ్ మొదలైంది. RRR వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతోన్న ఈ చిత్రానికి సంబంధించి పోరాటసన్నివేశాలను ముందుగా చిత్రీకరిస్తున్నారు. ఈ RRR వర్కింగ్ టైటిల్ ప్రేక్షకుల్లో ఇప్పటికే పాపులరైంది.
RRR కోసం రాజమౌళి 4-డి టెక్నాలజీ ని వాడుతున్నట్లు ఈ సాంకేతిక విలువలు శంకర్ "2.0" ను మించిన సాంకేతికత ప్రదర్శించబోతుందని దృశ్యాల సమాహారం నయనానందకరంగా సాగుతుందని — సమాచారం. అలాంటి సాంకేతికత ఈ సినిమా కోసం రాజమౌళి వాడుతున్నారట. కేవలం ఒక పోరాట సన్నివేశ చిత్రీకరణకే 120 కెమెరాలను వాడుతున్నట్లు టాలీవడ్ వర్గాల సమాచారం. హైదరాబాద్ నగర శివారులో వేసిన భారీ సెట్ లో ప్రస్తుతం ఈ పోరాట సన్నివేశాల చిత్రీకరణ జరుగుతుంది.
ఈ షెడ్యూల్ లో భాగం గానే 120 కెమెరాలలో భారీ అతి భారీ యాక్షన్ సన్నివేశాలన చిత్రీకరణ వెండితెరపై వెలుగులు చిందించేలా జరుగుతుందని సమాచారం. కాగా, ఒక కీలక పాత్రలో నటించమని ప్రముఖ బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ను రాజమౌళి సంప్రదించినట్లు వార్తలు వస్తున్నాయి. అజయ్ దేవగణ్ ఈ సినిమాలో కీలక పాత్రలో నటించటానికి అంగీకరించినట్లు సమాచారం.
ఇదిలా ఉంటే, రెండు రోజుల షూటింగ్ అనంతరం రాజమౌళి స్వల్ప అస్వస్థతకు గురికావడంతో బుధవారం నాడు ఈ సినిమా షూటింగ్‌కి బ్రేక్ పడింది. అయితే రాజమౌళి కాస్త కోలుకుని రాజమౌళి షూటింగ్‌కి రెడీ అయినా, పూర్తిగా కోలుకున్న తరువాతే షూటింగ్‌కి రావాల్సిందిగా రామ్ చరణ్, ఎన్టీఆర్ లు కోరినట్లు సమాచారం. ఆయన కోలుకున్న వెంటనే మళ్లీ షూటింగ్ మొదల వుతుందని సినీవర్గాల సమాచారం.
మొత్తానికి "బాహుబలి" తో అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఈ చిత్ర శిల్పి జక్కన్న, ఇప్పుడు RRR తో దర్శకుడిగా ఎన్ని సంచల నాలకో తెరతీయనున్నాడో అని, తన స్థాయిని మరింత ఉన్నతంగా ముందుకు తీసుకెళ్ళి తెలుగు వారి కీర్తి కాంతులు మరోసారి విశ్వవ్యాపితం చేయబోతున్నారు.