హీరోయిన్ తమన్నా లవ్, సెక్స్ గురించి పచ్చిగా మాట్లాడిందట. హద్దులు దాటేలా కామెంట్ చేసిందట. ఈ విషయం ఎవరో చెప్పడం కాదు.. తనే ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. ఇంతకీ ఏ విషయంలో అలా మాట్లాడింది.. ఆ వివరాల్లోకి వెళ్తే.. ఇదంతా రియల్ లైఫ్ లో కాదట.. రీల్ లైఫ్ లోనట.

Related image

తమన్నా హీరోయిన్ గా నటించిన నెక్స్ట్ ఏంటి సినిమా ఈనెల 7 న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్ కోసం ఇచ్చిన ఇంటర్వ్యూల్లో తన పాత్ర గురించి వివరాలు చెప్పింది. ఈ సినిమా స్క్రిప్టు చదివిన తర్వాత తాను చాలా ఆశ్చర్యపోయానని తమన్నా అంటోంది. ఈ సినిమాలో హీరోయిన్ లవ్, సెక్స్ గురించి ఎలాంటి బెరుకూ లేకుండా మాట్లాడేస్తుందట.

Related image

వాస్తవానికి ఇవన్నీ చాలా నేచురల్ విషయాలే అయినా.. ఓ అమ్మాయి నోట అలాంటి మాటలు వినడం షాకింగ్ గా ఉంటుందని తమన్నా అంటోంది. అంతే కాదు.. ఆ షాకింగే తనకు బాగా నచ్చిందట. అంతే కాదు.. ఆ అభిప్రాయాలన్నీ ఇంచు మించు తన అభిప్రాయాలేనట. అవన్నీ తన మనసులో నుంచి వచ్చినట్టు ఉన్నాయట. అందుకే.. కొన్ని సన్నివేశాలు చాలా పెద్దవైనా సింగిల్ టేక్ లో ఓకే చేసేసిందట తమన్నా.

Related image

మరి అంత బోల్డ్ గా తమన్నా లాంటి సుందరి మాట్లాడితే యూత్ ఏమవుతారో.. ఇప్పటికే ఆర్‌ఎక్స్ 100, 24 కిస్సెస్ వంటి సినిమాలు బోల్డ్ కంటెంట్ తో వస్తున్నాయి. ఇప్పుడు తమన్నా కూడా ఆ బాటలోనే వెళ్తుందా.. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో.. చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి: