రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముకేశ్ అంబానీ-నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ ప్రీ-వెడ్డింగ్ వేడుకల కోసం ఉదయ్ పూర్ అంగరంగ వైభవంగా ముస్తాబైంది. ఈ నెల 12న ఇషా అంబానీ-ఆనంద్ పిరమల్ వివాహం ముంబైలో జరగనుంది. ఈ వేడుకలకు అమెరికన్ పాస్ సింగర్ బియాన్స్ నోవెల్స్ హాజరయ్యారు.
సంగీత్ కార్యక్రమంలో బియాన్స్ దేవకన్యను – సర్పకన్యను తలపించింది. మత్తెక్కించే నాట్యంతో మైమరిపించింది. ఈ వేడుకలకు అమెరికాలోని డెమోక్రాటిక్ పార్టీ నేత, మాజీ అధ్యక్షుడు బిల్ క్లింటన్ భార్య హిల్లరీ క్లింటన్, క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్, ఆయన భార్య అంజలి, బాలీవుడ్ నటీనటులు హాజరయ్యారు. సాధారణంగా సెలబ్రెటీలు ఏదైనా వేడుకకు వెళ్తే..వారితో ఫోటోలు తీసుకునేందుకు అభిమానులు ఎగబడుతుంటారు.
కానీ ఇక్కడ మాత్రం సీన్ రివర్స్ అయ్యింది. అమెరికన్ పాప్ గాయని బియాన్స్ తో సెల్ఫీలు తీసుకునేందుకు సెలబ్రిటీలంతా పోటీ పడ్డారు. ఎరుపు రంగు మిర్రర్ ఛమ్కీల డ్రెస్ లో – లెహెంగాలో – రకరకాల డిజైనర్ దుస్తుల్లో ఈ అమ్మడు సందడి చేసింది. బియాన్స్ కోసం ప్రత్యేకించి అబు జానీ-సందీప్ కోస్లా ఈ డిజైనర్ దుస్తుల్ని డిజైన్ చేశారట.