
సుమ, అనసూయ, రష్మీ.. సినిమా హీరో హీరోయిన్లయినా తెలియకుండా ఉంటుందేమో.. సుమ, అనసూయ.. వంటి టీవీ యాంకర్ల గురించి తెలియని వారు మాత్రం ఉండరు. ఎప్పుడో ఒకసారి అదీ డబ్బు పెట్టి సినిమాకు వెళ్తే కనిపించే వారికంటే.. రోజూ బుల్లి తెరపై సందడి చేసే వీరికే క్రేజ్ ఎక్కువ. టాప్ సెలబ్రెటీలుగా వీరు చెలామణి అవుతున్నారు.
ఇంతకీ మరి వీరి రెమ్యూనరేషన్లు ఎలా ఉంటాయి. ఒక్కో కార్యక్రమానికి ఎంత తీసుకుంటారు. టీవీ యాంకర్లకు రెమ్యూనరేషన్ అంటే వారి పాపులారిటీ, టాలెంట్‌ను బట్టి ఉంటాయి. సుమ వంటి యాంకర్లకు వారి వాక్చాతుర్యం బట్టి టాప్ ప్రయారిటీ ఉంటుంది. ఇక అనసూయ, రష్మీ, శ్రీముఖి వంటి వారికి వారి గ్లామరే సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్.
బుల్లితెర గ్లామర్ రాణులుగా పేరున్న అనసూయ, రష్మీల కంటే.. వాక్చాతుర్యంతో ప్రోగ్రామ్‌కు వన్నె తెచ్చే సీనియర్ యాంకర్ సుమకు అందరికన్నా ఎక్కువ రెమ్యూనరేషన్ ముడుతోందట. ఒక్కో ప్రోగ్రామ్‌కు సుమ రెండున్నర లక్షల రూపాయల వరకూ తీసుకుంటున్నారని టాక్.
ఇక టీవీ కార్యక్రమాలతోనే కాకుండా అడపాదడపా సినిమాల్లోనూ సందడి చేస్తున్న అనసూయకు నెక్స్ట్ ప్రయారిటీ.. ఆమెకు లక్షన్నర నుంచి రెండు లక్షల వరకూ ఇస్తున్నారట. ఇక రష్మికి లక్షన్నర వరకూ పారితోషకం ముడుతోందట. మిగిలిన యాంకర్లు తమ డిమాండ్‌ను బట్టి వసూలు చేస్తున్నారట.