ఇప్పుడంటే అవార్డ్ ఫంక్షన్ అంటే ఇంద్రభవనం లాంటి సెట్.. పరిశ్రమలోని పెద్దలంతా దాన్ని ఓ పెద్ద పండుగలా చేస్తుంటారు. అయితే పండుగలా చేయడం కరెక్టే కాని ఇప్పుడున్న హంగు ఆర్భాటాలు ఒకప్పుడు లేవు. లేటెస్ట్ గా 1980లో జరిగిన ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ఫంక్షన్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
27వ ఫిల్మ్ ఫేర్ అవార్డ్ ఫంక్షన్ గా జరిగిన ఆ వీడియో కమల్ హాసన్, శోభన్ బాబులతో పాటుగా హీరోయిన్స్ రాధిక, జయసుధ, జయలలిత ఇంకా బాలీవుడ్ యాక్టర్స్ చాలా మంది ఉన్నారు. మన హీరోల్లో శోభన్ బాబు తప్ప ఎవరు కనిపించలేదు. ఈ అవార్డ్ ఫంక్షన్ ఎంత సింపుల్ గా జరిగిందో వీడియో చూస్తే తెలుస్తుంది.
అంతేకాదు స్టార్స్ కూడా చాలా సింపుల్ గానే ఉన్నారు. ఇప్పటి కాలంలో మన ఇళ్లల్లో జరిగే ఓ చిన్న ఫంక్షన్ లా ఈ ఈవెంట్ జరిగింది. 1954 నుండి ఫిల్మ్ ఫేర్ అవార్డులు ప్రవేశ పెట్టడం జరిగింది. ఫిల్మ్ ఫేర్ లో 15 రకాల అవార్డులు ఇస్తారు. 2016లో ఫిల్మ్ ఫేర్ అవార్డుల కింద 31 సెగ్మెంట్స్ చేర్చారు. వారిలో క్రిటిక్ అవార్డులు కూడా ఉండటం విశేషం.
ప్రభుత్వం ఇచ్చే నేషనల్ అవార్డులకు సరిసమానంగా ఈ ఫిల్మ్ ఫేర్ అవార్డులు క్రేజ్ తెచ్చుకున్నాయి. ఫిల్మ్ ఫేర్ అవార్డ్ కమిటీ అన్ని భాషల్లో రిలీజైన సినిమాలు చూసి బెస్ట్ అనిపించిన వాటికి ఫిల్మ్ ఫేర్ అందిస్తారు. పరిశ్రమలు పెద్దవవడం వల్ల ఫిల్మ్ ఫేర్ సౌత్, నార్త్ రెండు వేరు వేరు ఫంక్షన్స్ గా నిర్వహిస్తున్నారు.