సినీ స్టార్ ను రాజకీయ నాయకుడిగా మారిన పవన్ కల్యాణ్.. ఇప్పుడు అమెరికా పర్యటనలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో ఏపీలో ఎలాగైనా సీఎం కుర్చీ అధిరోహించాలని పట్టుదలగా ఉన్న ఆయన ఎన్నారైల మద్దతు కోసం అమరికాలో పర్యటిస్తున్నారు. అందులో భాగంగా ఆయన డల్లాస్ లో జరిగిన ప్రవాస గర్జన సభలో పాల్గొన్నారు. ఆ సమయంలో అభిమానులతో ఎన్నో విషయాలు పంచుకున్నారు.

Image result for pawan kalyan and chiranjeevi photos


యూత్ గా ఉన్నప్పుడు కుర్రాళ్లెవరైనా ప్రేమలో పడతారు. అమ్మాయిల చుట్టూ తిరుగుతారు. ఫ్రెండ్స్ తో షికార్లు కొడతారు. కానీ పవన్ కల్యాణ్ ఇవేమీ చేయలేదట. వీటి పట్ల అంత ఆసక్తి లేదట. కానీ విచిత్రంగా ఆధ్యాత్మికత, సమాజ సేవ అంటే ఎక్కువగా ఇంట్రస్ట్ ఉండేదట. మరి అన్నయ్య చిరంజీవి అప్పట్లో సినిమాల్లో ఫుల్ బిజీ కదా.

Image result for pawan kalyan and chiranjeevi photos


ఓ రోజు చిరంజీవి తీరక చేసుకుని.. కల్యాణ్ ఏం చేద్దామనుకుంటున్నావురా.. అంటూ కూర్చోబెట్టుకుని అడిగారట. దీంతో పవన్‌ కల్యాణ్ తన మనసులో మాట బయటపెట్టారట. చెప్పడమంటే అలా ఇలా కాదు... మెగాస్టార్‌కే దిమ్మతిరిగేలా ఆధ్యాత్మిక పాఠాలు అప్పజెప్పాడట. అంతా విన్న చిరంజీవి చివర్లో పవన్‌ కు మాంచి ఝలక్ ఇచ్చారట.

Image result for pawan kalyan and chiranjeevi photos


నీకేం రా.. నువ్వు ఎన్నైనా చెబుతావు. ఎందుకంటే నువ్వు చిరంజీవి తమ్ముడివి కదా.. అన్నారట చిరంజీవి. డబ్బుకు కొదువ లేదు. చదవకపోయినా అడిగేవారు లేరు. అలాంటప్పుడు ఎన్ని కబుర్లయినా చెబుతావు.. అలా కాకుండా నీ కాళ్లపై నిలబడి అప్పుడు చెప్పు ఎన్నిమాటలైనా వింటా అన్నాడట చిరంజీవి. దాంతో పవన్ షాక్ తిన్నాడట. అదీ అన్నాదమ్ముల ఫ్లాష్ బ్యాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: