‘రంగస్థలం’ సూపర్ సక్సస్ తరువాత చరణ్ నటిస్తున్న వినయ విధేయ రామ’ ఇంకా విడుదల కాకుండానే ఆమూవీ గ్రాఫ్ నెమ్మదినెమ్మదిగా తగ్గిపోతు ఉండటం అత్యంత ఆశ్చర్యకరంగా మారింది. ‘రంగస్థలం’ రికార్డులను ఈమూవీ బ్రేక్ చేస్తుంది అని మెగా అభిమానులు కలలు కంటూ ఉంటే దానికి భిన్నంగా జరుగుతున్న పరిణామాలు మెగా అభిమానులకు కూడ కలవర పాటును కలిగిస్తున్నట్లు టాక్.
దీనికి కారణం ఈమూవీకి సంబంధించి ఇప్పటి వరకు విడుదలైన రెండు పాటలు పూర్తిగా మెగా అభిమానులకు కూడ కనెక్ట్ కాని స్థితిలో ఉండటం దేవీశ్రీప్రసాద్ లాంటి క్రేజీ మ్యూజిక్ డైరెక్టర్ ట్యూన్స్ అందించిన ఈరెండు పాటలు సాధారణ సినిమా అభిమానులకే కాదు మెగా అభిమానులకు కూడ పూర్తిగా నచ్చలేదు అన్న వార్తలు వస్తున్నాయి. దీనికితోడు ఈమూవీ సంక్రాంతి రేసుకు వస్తున్న సినిమాల ప్రమోషన్ విషయంలో కూడ బాగా వెనకపడి ఉంది.
ఎన్టీఆర్ బయోపిక్ కు సంబంధించిన ఆడియో ఫంక్షన్ అత్యంత ఘనంగా ఈనెల 21న జరగబోతూ ఉంటే ‘వినయ విధేయ రామ’ మూవీ పాటల చిత్రీకరణ ఇంకా కొనసాగుతూనే ఉంది. దీనికితోడు ఈమూవీకి బోయపాటి ఎంతో ఇష్టపడి పెట్టిన ఈ సాఫ్ట్ టైటిల్ ఎంత వరకు మాస్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతుది అన్న విషయంలో కూడ భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.
ఇది ఇలా ఉండగా ఈమూవీ సంక్రాంతి రేస్ కు రాబోతున్న ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ వెంకటేష్ వరుణ్ తేజ్ ల ‘ఎఫ్ 2’ లతో పోటీ పడుతూ ఉన్న నేపధ్యంలో ఇంత తీవ్ర పోటీ మధ్య మూవీ ఎంత వరకు నిలబడుతుంది అన్న అనుమానాలు ఈ మూవీ బయ్యర్లను వెంటాడుతున్నట్లు టాక్. దీనికితోడు ఈమూవీ పై బోయపాటి ఖర్చు పెట్టిన బడ్జెట్ తారా స్థాయికి చేరిపోవడంతో ఈమూవీకి మంచి ఓపెనింగ్స్ వచ్చినా సంక్రాంతి తరువాత పోటీని తట్టుకుని కలక్షన్స్ విషయంలో నిలబడగలుగుతుందా అంటూ కొందరు ఇండస్ట్రీలో చేస్తున్న నెగిటివ్ ప్రచారం ఈమూవీ నిర్మాతలతో పాటు బయ్యర్లను కూడ విపరీతంగా భయపెడుతున్నట్లు సమాచారం..