తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో అద్భుతమైన పాటలు పాడి సుశీల,జానకి ల తర్వాత అంత గొప్ప స్థానం సంపాదించారు చిత్ర. తన పాటలతో సంగీత ప్రియులని ఎంతగానో పరవశింపజేసే చిత్ర తన కూతురి జయంతి సందర్భంగా ఫేస్ బుక్‌లో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. కూతురు అంటే ఎంతో ప్రేమగా చూసుకునే చిత్ర ఆ చిన్నారి మరణం ఇప్పటికీ మరువలేని పరిస్థితి.
చిత్ర కూతురు నందన 7 ఏళ్ళ వయస్సులో కన్నుమూసింది. ఏప్రిల్ 2011న స్విమ్మింగ్ ఫూల్ లో పడి చనిపోయింది. తన ముద్దుల కూతురు ఆకస్మిక మరణంతో చిత్ర సంవత్సరం పాటు కోలుకోలేని పరిస్తితి ఏర్పడింది. ఆ చిన్నారి మృతి సినీ ఇండస్ట్రీనే కాదు..అభిమానులను పైతం కంట తడి పెట్టించింది.
నిన్న చిత్ర కూతురు నందన జయంతి కావడంతో చిన్నారి ఫోటోని సోషల్ మీడియాలో పోస్ట్ చేసి నివాళులు అర్పించింది. ఈ సందర్భంగా పరలోకం నుండి వచ్చిన దేవదూత మా జీవితాన్ని అద్భుత కథగా మార్చింది. నువ్వు మాకు దొరికిన గొప్ప సంపద అంటూ ఎమోషనల్ పోస్ట్ పెట్టింది చిత్ర. \