టాలీవుడ్ శేఖర్ కమ్ముల అంటే ఫ్యామిలీ తరహా సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అంటారు.  ఆయన తీసిన సినిమాల్లో ఎలాంటి అశ్లీలత..వ్యంగ్యం..వైలెన్స్ ఉండవు..కూల్ ఒక మంచి కాఫిలాంటి సినిమాలే తీస్తుంటారు.  అలా వచ్చిన సినిమా ‘ఫిదా’. మెగాప్రిన్స్ వరుణ్ తేజ్, సాయి పల్లవి కాంబినేషన్ లో వచ్చిన ఈ సినిమా తెలుగు రాష్ట్రాల ప్రజల మన్ననలు పొందింది.  ఈ సినిమాలో సాయి పల్లవి తెలంగాణ యాసలో మాట్లాడటం..అమాయకంగా ఉంటూనే..చలాకి తనం చూపించిన ‘భానుమతి’హైబ్రీడ్ పిల్లా అంటూ డైలాగ్స్..అందరి మనసు దోచింది. సాయిపల్లవి అచ్చమైన తెలంగాణ అమ్మాయిలా నటించి తెలుగు ప్రేక్షకుల మనసు దోచింది. 
Image result for FIDA MOVIE
ఆ తర్వాత సాయి పల్లవి నటించిన సినిమాలు కొన్ని వచ్చినా..ఫిదా స్థాయిలో హిట్ కాలేదు. తెలుగు తెరపై నటన పరంగా సౌందర్య తరువాత ఎక్కువ మార్కులు కొట్టేసిన కథానాయికగా సాయిపల్లవి పేరు వినిపిస్తోంది.  హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయిపల్లవి నటించిన ‘పడి పడి లేచే మనసు’ సినిమా మిశ్రమ స్పందన తెచ్చుకుంది.  ఈ సినిమాలో సాయి పల్లవి నటనను అంతా ప్రశంసిస్తున్నారు.  తాజాగా ఓ ఇంటర్వ్యూలో సాయి పల్లవి మాట్లాడుతూ..'ఫిదా' సినిమాను గురించి ప్రస్తావిస్తూ, ఆ సినిమాలో పోషించిన భానుమతి పాత్రను జనం ఇంకా మరిచిపోలేదు.
Image result for PADE PADI LECHE MANASU MOVIE
నేను ఎక్కడికి వెళ్లినా 'భానుమతి' అనే పిలుస్తున్నారు.  ఈ మద్య  నేను హీరోలను డామినేట్ చేయడానికి ప్రయత్నిస్తాను అనే విమర్శలు వున్నాయి...అలా చేస్తే ఇండస్ట్రీలో కెరీర్ ముందుకు సాగదు కదా..నా పాత్రకి ఎంతవరకూ న్యాయం చేశానా అనే నేను చూసుకుంటాను. ఇక షూటింగుకి నేను ఆలస్యంగా వస్తాననే ప్రచారం లోను ఎంతమాత్రం నిజం లేదు అని ఆమె స్పష్టం చేశారు.



మరింత సమాచారం తెలుసుకోండి: