సినీరంగంలో అవకాశాలు వరుసగా క్యూకట్టాలంటే అదృష్టం ఉండాలి. లేదా అంతకుమించి ఆకట్టుకునే కనికట్టు తెలిసుండాలి. మరి ఏ మంత్రం వేస్తోందో కానీ ఓ కుర్ర హీరోయిన్ వరుసగా ఛాన్సులు పట్టేస్తోంది. విడుదలైంది ఒక్క సినిమాయే అయినా.. అదీ యావరేజ్ టాక్ మాత్రమే తెచ్చుకున్నా.. ఈ అమ్మడుని అవకాశాలు వరిస్తూనే ఉన్నాయి.

సంబంధిత చిత్రం


ఇంతకీ ఆ హీరోయిన్ పేరు చెప్పనే లేదు కదా. ఆమే నిధి అగర్వాల్. సవ్యసాచి చిత్రంతో ఈ అమ్మడు తెలుగు తెరకు పరిచయం అయ్యింది. తొలి సినిమాతోనే లేత అందాలతో సినీ పరిశ్రమను ఆకట్టుకుంది.

nidhi aggarwal hd కోసం చిత్ర ఫలితం


అన్న నాగ చైతన్యతో మొదటి సినిమా విడుదలయ్యీ అవకుండానే.. తమ్ముడు అఖిల్ సరసన కూడా ఛాన్స్ కొట్టేసింది. అఖిల్‌తో మిస్టర్ మజ్నులో నిధి అగర్వాల్ నటిస్తోంది. మరోవైపు కుర్రహీరో నాగశౌర్య సినిమాలోనూ అవకాశం దక్కించుకుందట.

సంబంధిత చిత్రం

నాగశౌర్య సినిమా ఇంకా పట్టాల మీదకు ఎక్కనే లేదు. నిధి అగర్వాల్ మాత్రం వరుసగా నాలుగో ఛాన్స్ కూడా దక్కించుకుంది. సాయి ధరమ్‌ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా తీయబోతున్న చిత్రానికి కూడా నిధి అగర్వాల్ పేరునే పరిశీలిస్తున్నారట. అదీ సంగతి.


మరింత సమాచారం తెలుసుకోండి: