క్రేజీ యంగ్ హీరోగా మరోపోయిన విజయ్ దేవరకొండ ఒకవైపు హీరోగా కొనసాగుతూనే మరో వైపు వ్యాపారవేత్తగా మారడానికి ‘రౌడీస్’ అనే బ్రాండ్ తో గార్మెంట్స్ బిజినెస్ లోకి వచ్చిన విషయం తెలిసిందే. సినిమాలకు సంబంధించిన ఫంక్షన్స్ లో ‘వాట్సాప్ రౌడీ బాయ్స్’ అంటూ విజయ్ అభిమానులను పలకరించే తీరు చాలా డిఫెరెంట్ గా ఉంటుంది.
ఇప్పుడు దానినే బ్రాండ్ గా మార్చి ‘రౌడీస్’ పేరుతో గార్మెంట్స్ బ్రాండ్ కూడ మొదలుపెట్టి దాన్ని మార్కెట్ చేస్తున్న విజయ్ దేవరకొండ ఈ విషయంలో కూడ తాను సంచలనాలకు రెడీగా ఉన్నాను అన్న సంకేతాలు ఇస్తున్నాడు. న్యూ ఇయర్ సందర్భంగా ఒక ప్రముఖ దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ మాట్లాడుతూ తాను మొదలుపెట్టిన ‘రౌడీ వేర్’ బిజినెస్ స్థాయి గురించి మాట్లాడాడు.
తన బిజినెస్ చాలా వేగంగా ఎదుగుతోందని రెండేళ్లలో అది వందకోట్ల కంపెనీ అవుతుందని తన అంచనాలు బయటపెట్టాడు. అంతేకాదు ఈబ్రాండ్ కు సంబంధించి త్వరలో అన్ని ప్రముఖ నగరాలలో ఫ్యాషన్ పెరేడ్స్ నిర్వహించబోతున్న సంకేతాలు కూడ ఇస్తున్నాడు. దేశ వ్యాప్తంగా తనకు మాత్రమే కాకుండా తన ప్రోడక్ట్ కు కూడ ఒక ఐడెంటిటీ ఉండాలనే ఉద్దేశంతో తాను ఈబిజినెస్ మొదలుపెట్టానని తాము చేసిన క్రియేటివ్ ప్రమోషన్ వల్ల యూత్ కు తన గార్మెంట్స్ బాగా కనెక్ట్ అయ్యాయి అంటూ తన వ్యాపార లక్ష్యాలను కొత్త సంవత్సరం సందర్భంగా బయటపెట్టాడు.
అంతేకాదు తాను త్వరలో ఒక ప్రొడక్షన్ హౌస్ ప్రారంభిస్తున్న విషయాలను కూడ వివరిస్తూ ఈప్రొడక్షన్ హౌస్ ద్వారా కొత్త వాళ్ళతో సినిమాలు తీయబోతున్న విషయాన్ని వివరించాడు. అదేవిధంగా దర్శకుడు తరుణ్ భాస్కర్ ను హీరోగా మార్చి సినిమా తీసే విషయంలో వస్తున్న వార్తలను విజయ్ ఖండించని నేపధ్యంలో విజయ్ తరుణ్ భాస్కర్ ను త్వరలోనే హీరోగా మారుస్తున్నాడు అనుకోవాలి. ఇప్పటికే తన క్రేజ్ తో టాప్ హీరోలకు దడ పుట్టిస్తున్న విజయ్ తన వ్యాపారాలకు సంబంధించి అనుసరిస్తున్న వ్యూహాలతో ఈ క్రేజీ యంగ్ హీరో ఈ కొత్త సంవత్సరంలో చాల సంచలనాలు సృష్టించడానికి రెడీ అవుతున్నట్లు అనుకోవాలి..