ఈ సంక్రాంతి కి  అన్ని సినిమా లు చాలా అంచనాల మీద వచ్చాయి , వస్తున్నాయి . అయితే ఒక రజినీ సినిమా అయినా పేట తప్ప. ఈ సినిమా మీద ఎవరికీ పెద్దగా అంచనాలు లేవు. థియేటర్ విషయం లో కూడా పెద్ద రచ్చ జరిగింది. ఈ సినిమా ప్రొడ్యూసర్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినాడు. అయితే ఈ సినిమా ఎట్టకేలకు రిలీజ్ అయ్యింది. విభిన్న చిత్రాలతో తన ప్రతిభ చాటుకున్న కార్తీక్ సుబ్బరాజ్ ఈ చిత్రానికి దర్శకుడు కావడంతో ఆసక్తి నెలకొంది.

Image result for peta rajini

రజనీకాంత్ సరసన ఈ చిత్రంలో సీనియర్ హీరోయిన్ సిమ్రాన్, త్రిష హీరోయిన్లుగా నటిస్తుండడం విశేషం. యంగ్ బ్యూటీ మేఘా ఆకాష్ కీలక పాత్రలో నటిస్తోంది. అనిరుద్ ఈ చిత్రానికి సంగీత దర్శకుడు. ఇటీవల విడుదలైన ట్రైలర్ లో రజనీకాంత్ స్టైలిష్ గా, ఎనర్జిటిక్ ఆటిట్యూడ్ తో కనిపించారు. నేడు ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా సోషల్ మీడియాలో రెస్పాన్స్ ఎలా ఉందో చూద్దాం. 

Image result for peta rajini

చాలా రోజుల తర్వాత అసలు సిసలైన రజనీకాంత్ సినిమా చూశా. సినిమా మొత్తం ఎంజాయ్ చేశా. పేట చిత్రం గురించి ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతి ప్రేము మాస్. చిత్రంలో ప్రతి ఒక్కరి పెర్ఫామెన్స్ అదుర్స్ అనిపించే విధంగా ఉంది.  దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ పాత రజినీకాంత్ ని చూపిస్తున్నాడు. ఫస్ట్ హాఫ్ కేక పెట్టించే విధంగా ఉంది . దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ క్లైమాక్స్ లో అద్భుతమైన ట్విస్ట్ పెట్టాడు. పెట్ట చిత్రంలో మాస్, క్లాస్, రొమాన్స్, ఎమోషన్ అన్ని అంశాలు ఉన్నాయి. నా చిన్న తనంలో సూపర్ హీరోలా చూసిన రజనీని మళ్ళీ చూస్తున్నా. భాషా, నరసింహ చిత్రాల తర్వాత చాలా రోజులకు రజని అభిమానుల కల నెరవేరింది. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజ్ అన్ని అంశాలని చక్కగా పొందుపరిచారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: