హీరోయిన్ అంటే అందాలు ఆరబోయాలి.. హీరోతో రొమాన్స్ చేయాలి.. కథ డిమాండ్ చేస్తే ఇంకో అడుగు ముందుకేయాలి.. ఈతరం హీరోయిన్లకు ఈ సంగతులు తెలియనివేమీ కావు. అందుకే బోల్డ్ సీన‌లు చేసేందుకు ఏమాత్రం వెనుకాడటం లేదు.

Image result for rx 100 movie


అంతేకాదు.. ఈ తరహా బోల్డ్ సీన్లతో పది సినిమాలు చేసినా రాని పాపులారిటీ వచ్చిపడుతోంది. అంతా బాగానే ఉంటుంది. కానీ అలాంటి సినిమాలు సొంత ఫ్యామిలీతో కూర్చుని చూడాలంటే మాత్రం ఇబ్బందే. పాపం ఇదే ఇబ్బంది వచ్చిందట ఆర్‌ఎక్స్ 100 హీరోయిన్ పాయల్‌ రాజ్‌పుత్‌కు.

Related image


ఈ సినిమాలో హీరోయిన్ క్యారెక్టర్ చాలా పెక్యులియర్. కామవాంఛ తీర్చుకోవడానికి హీరోపై ప్రేమ వల విసురుతుంది. తన స్వార్థం కోసం హీరోను లైంగికంగా వాడుకుని వదిలేస్తుంది. చిరవకు అతడిని చంపించేందుకు కూడా వెనకాడదు. అందుకే స్టోరీ ప్రకారం ఈ సినిమాలో పాయల్ చాలా హాట్ హాట్ గా నటించింది.

Related image


ఈ సినిమా తల్లితో కలసి చూసేటప్పుడు పాపం పాయల్ చాలా ఇబ్బందిపడిందట. కూతురు ఇబ్బంది చూసి ఆమె తల్లి సర్ది చెప్పిందట. ఇదంతా నీ ప్రోఫెషన్‌లో భాగమే.. ఇందుకు నువ్వు ఇబ్బంది పడాల్సిందేమీ లేదని భరోసా ఇచ్చిందట. తనను అంతగా సపోర్ట్ చేస్తారు కాబట్టే తన ఫస్ట్ ప్రయారిటీ ఫ్యామిలీకేనంటోంది రాజ్‌పుత్.

Related image



మరింత సమాచారం తెలుసుకోండి: