తెలుగు ఇండస్ట్రీలోకి కృష్ణం రాజు నట వారసుడిగా ఈశ్వర్ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ‘బాహుబలి’సీరిస్ తో జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు.  ప్రపంచ వ్యాప్తంగా ఈ హీరోను ఇప్పుడు బాహుబలి అని పిలుస్తున్నారు.  బాహుబలి 2 చిత్రం తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ప్రభాస్ యంగ్ డైరెక్టర్ సుజిత్ దర్శకత్వంలో ‘సాహూ’చిత్రంలోనటిస్తున్నాడు.
Image result for sahoo movie
భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో ప్రభాస్ జ్యూవెలరీ దొంగగా కనిపించబోతున్నాడట.  ప్రభాస్ తన ఫ్యాన్స్ కి ఓ గుడ్ న్యూస్..సాహూ చిత్రం  ఈ సంవత్సరం ఆగస్టులో విడుదలకానుంది. ఇక ఇదే సంవత్సరం చివరిలో ప్రభాస్ హీరోగా, 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం కూడా విడుదలవుతుందట. 
Related image
మొదట ఈ చిత్రాన్ని 2020 లో విడుదల చేయాలని అనుకున్నప్పటికీ.. షూటింగ్ అనుకున్న సమయం కంటే ముందే పూర్తయ్యే అవకాశాలు కనిపిస్తుండడంతో డిసంబర్ లో చిత్రం విడుదల చేయాలని అనుకుంటున్నారు. మొత్తానికి ఈ ఏడాదిలో ప్రభాస్ రెండు చిత్రాలు రిలీజ్ కావడం అభిమానుల సంతోషాలకు అవధులు లేకుండా పోతున్నాయి. 


మరింత సమాచారం తెలుసుకోండి: