టాలీవుడ్ లో కింగ్, మన్మథుడిగా పేరు తెచ్చుకున్న అక్కినేని నాగార్జున కెరీర్ లో కె విజయ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన మన్మథుడు సినిమా ఒక మైలు రాయి అని చెప్పొచ్చు. ప్రేమ విఫలమైందని కోపిష్టిగా మారిన నాగార్జున హీరోయిన్ సోనాలీ బింద్రే ప్రేమలో ఎలా పడ్డాడు..వారి ప్రేమ ఎలా సక్సెస్ అయ్యిందనే కాన్సెప్ట్ తో అద్భుతంగా తీర్చిదిద్దారు. ఈ సినిమాలో మరో హీరోయిన్ అన్షు అమాయకురాలిగా నాగార్జున ప్రేమికురాలిగా నటించింది. ఈ సినిమా సీక్వెల్ తెరకెక్కనుందని కొన్నాళ్ళుగా ప్రచారం జరుగుతుంది. దీనిపై ఇప్పటి వరకు అఫీషియల్ ప్రకటన రాలేదు.
టాలీవుడ్ సమాచారం ప్రకారం రాహుల్ రవీంద్రన్ దర్శకత్వంలో మన్మథుడు 2 సినిమా తీస్తున్నట్లు గత కొంత కాలంగా సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో ఇద్దరు కథానాయికలకు చోటు ఉండడంతో పాయల్ రాజ్‌పుత్‌ని ఒక కథనాయికగా ఎంపిక చేశారని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాయల్ రాజ్ పూత్ మాట్లాడుతూ.. మన్మథుడు 2 సినిమాలో తాను నటిస్తున్నానంటూ వస్తున్న వార్తలు అవాస్తవం అని అన్నారు. మార్చి మొదటి వారం నుండి మన్మథుడు2 సినిమా తొలి షెడ్యూల్ పోర్చుగల్‌లో జరగనుండగా, ఎక్కువ శాతం చిత్రీకరణ యూరప్‌లో జరపనున్నారని తెలుస్తుంది.
ఈ సినిమాకు ఆర్ఎక్స్ 100 ఫేమ్ చైతన్ భరద్వాజ్ మన్మథుడు 2 సినిమాకి సంగీతం అందించనున్నాడని సమాచారం. పాయల్ రాజ్ పూత్ ఈ సినిమాలో లేదంటే నాగార్జున సరసన ఎవరు నటిస్తారు అనే దానిపై అభిమానులలో ఆసక్తి మరింత పెరిగింది. ప్రస్తుతం పాయల్ రాజ్ పూత్ రవితేజ డిస్కోరాజా చిత్రంలో ఆఫర్ కొట్టేయగా, వెంకీ మామ 2లో చైతూతో జతకట్టనుందని సమాచారం. కాగా, మన్మథుడు 2 ప్రాజెక్ట్‌కి సంబంధించి అఫీషియల్ ప్రకటన త్వరలో రానున్నట్లు సమాచారం.