వరస పరాజయాలతో సతమతమవుతున్న నాగచైతన్యకు సమంతతో కలిసి నటిస్తున్న ‘మజిలీ’ విజయం అత్యంత కీలకంగా మారడంతో ఈమూవీ విజయం చైతు కెరియర్ కు పరీక్షగా మారింది.  చైతు సమంతల పెళ్లి తరువాత అక్కినేని జంట నుంచి  వస్తున్న మొదటి సినిమా కావడంతో మజిలీ పై  ఆడియన్స్ కూడ మంచి అంచనాలు ఉన్నాయి. 

దర్శకుడు శివ నిర్వాణ ఈసినిమా దర్శకత్వం వహించే విషయంలో చాల జాగ్రత్తలు తీసుకుంటున్నా అతడికి మించిన జాగ్రత్తలను సమంత తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈసినిమా షూటింగ్ సమయంలో ప్రతి సీన్ గురించి చర్చించడమే కాకుండా  అలాగే మ్యూజిక్ విషయంలో కూడా విపరీతమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. 

ఈసినిమాకు సంబంధించి నాగ చైతన్య షూటింగ్ చేసి తన పని అయిపోగానే కొన్నిసార్లు ఇంటికి వెళ్లిపోయిన తరువాత కూడ సమంత చైతన్యతో కలిసి ఇంటికి వెళ్ళి  పోకుండా తనకు సంబంధం లేని సీన్స్ ని షూట్ చేస్తున్నప్పుడు కూడా స్పాట్ లొనే ఉంటూ దర్శకుడు శివ నిర్వాణకు సూచనలు ఇస్తున్నట్లు సమాచారం. దీనితో ఈ సినిమాకు సంబంధించి సగం డైరక్షన్ సమంత చేస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి. 
samantha
అయితే సమంత మితిమీరిన ఉత్సాహంతో చేస్తున్న సూచనలు అమలు పరిచే విషయంలో దర్శకుడు శివ నిర్వాణ కన్ఫ్యూజ్ అవుతున్నట్లు సమాచారం. కథల ఎంపిక విషయంలో చైతన్య చేస్తున్న పొరపాట్ల వల్ల అతడికి వరస పరాజయాలు వస్తున్నాయి అన్న కామెంట్స్ నేపధ్యంలో సమంత ‘మజిలీ’ విషయంలో ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది అని అంటున్నారు. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకుని ఏప్రిల్ లో రిలీజ్ కాబోతున్న ‘మజిలీ’ కి సమంత సూచనలు ఎంత వరకు హిట్ ఇస్తాయో చూడాలి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: