బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ మొదటి నుంచి కాస్త దూకుడుగానే ఉంటారు. స్వతహాగా ఆయన స్టంట్ మాస్టర్..ఈ నేపథ్యంలో ఎన్నో సహాసోపేతమైన స్టంట్స్ చేసిన విషయం తెలిసిందే. హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అక్షయ్ బాలీవుడ్ సూపర్ స్టార్ రాజేష్ ఖన్నా ముద్దుల కూతురు ట్వింకిల్ ఖన్నాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరి దాంపత్యం ఎంత ఫ్రెండ్లీగా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ట్వింకిల్ ఖన్నా సోషల్ మీడియాలో వేదికగా తన కుటుంబ విషయాలు కూడా పోస్ట్ చేస్తుంటారు.
తాజాగా అక్షయ్ కుమార్ ది ఎండ్ అనే వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా ఒంటికి నిప్పంటించుకోని సాహసం చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. స్టేజ్ పై నిప్పంటిచుకొని అక్షయ్ వస్తుంటే అక్కడున్న అభిమానులు ఒక్కసారిగా షాక్ కి గురయ్యారు. అయితే అభిమానుల పరిస్థితే ఇలా ఉంటే..మరి ఆయన సతీమణి ట్వింకిల్ ఖన్నా పరిస్థితి ఏంటో ఊహించుకోవచ్చు. ఈ క్రమంలో ఆమె తన ట్విట్టర్ వేదికగా.. దారుణం! ప్రమోషన్ కోసం నీ ఒంటికి నీవే నిప్పంటిచుకున్నావు.
ఒకవేళ నువ్వు బ్రతికి ఉంటే ఇంటికి రా.. నేనే నిన్ను చంపేస్తాను అని ఫైర్ అయింది ట్వింకిల్. దీనికి స్పందించిన అక్షయ్ నా భార్య నాపై సీరియస్ అయ్యింది..నాకు భయం వేస్తుందని అన్నారు. అయితే సాహసమే తన ఊపిరి అంటున్న అక్షయ్ కుమార్ తన రక్తంలోనే యాక్షన్ ఉందన్నాడు. తన కుమారుడు ఆరవ్ సూచన మేరకు ఈ వెబ్‌సిరీస్‌లో నటించడానికి ఒప్పుకొన్నట్లు పేర్కొన్నారు అక్షయ్.