హ్యాపీడేస్ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయిన నటి తమన్నా.   మొదట్లో తమన్నకు తెలుగు, తమిళ సినిమాలు ఏవీ పెద్దగా కలిసి రాలేదు.  దాంతో లాభం లేదని ఐటమ్ సాంగ్స్ కి ఓకే చెప్పింది.  ఓవైపు హీరోయిన్ గానే నటిస్తూ..పలు సినిమాల్లో ఐటమ్ సాంగ్ లో నటించింది.  ఆ మద్య బాలీవుడ్ లోకి వెళ్లిన అక్కడ కూడా పెద్దగా వర్క్ ఔట్ కాలేదు.  దాంతో తెలుగు, తమిళ సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ చేస్తుంది.  ఎస్ ఎస్ రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసిన ‘బాహుబలి’మొదటి పార్ట్ లో అవంతిక పాత్రలో నటించింది. 
Image result for raju gari gadhi
ఈ పాత్ర మొదట అప్సరసలా కనిపించినా..తర్వత వీరనారిగా కనిపించింది.  మొత్తానికి బాహుబలి ఎఫెక్ట్ తో తమన్నాకు జాతీయ స్థాయిలో మంచి గుర్తింపు లభించింది.  దాంతో ఇప్పుడు తెలుగు, తమిళ, హిందీ భాషల్లో వరుసగా సినిమాల్లో ఛాన్స్ దక్కించుకుంటుంది.  ఇటీవల వెంకటేష్, వరుణ్ తేజ్ నటించిన ‘ఎఫ్ 2’సినిమాలో వెంకి సరసన నటించింది. తమన్నా ఒక వైపున మోడ్రన్ లేడీగా..మరో వైపున పల్లెటూరి అమ్మాయిగా కనిపిస్తూ తమిళంలో 'దేవి' సినిమా చేసింది. ఈ హారర్ థ్రిల్లర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 
Related image
తాజాగా తమన్నా మరో హర్రర్ మూవీలో నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.  గతంలో  హారర్, థ్రిల్లర్  నేపథ్యంలో దర్శకుడు, యాంకర్ ఓంకార్ ‘రాజుగారి గది’సినిమా తీశారు.  ఈ సినిమా అందరినీ బాగా ఆకర్షించింది.  ఆ తర్వాత నాగార్జునతో రాజుగారి గది 2 తీశారు..ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఫలితం రాలేదు.  దాంతో కొంత గ్యాప్ తీసుకుని 'రాజుగారి గది 3' చేయడానికి రంగంలోకి దిగాడు. ఈ కథను ఆయన తమన్నాకి వినిపించడం  ఆమె ఓకే చెప్పేయడం జరిగిపోయాయట.  దీనికి గురించి అఫిషియల్ ప్రకటన రావాల్సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: