
ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోలు రాజ్యమేలుతున్న సమయంలో స్వయంకృషితో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకొని తెలుగు ప్రజల గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించారు మెగాస్టార్ చిరంజీవి. డ్యాన్స్, ఫైట్స్ లో కొత్తదనాన్ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసిన ఆయన నటించి ఎన్నో చిత్రాలు సూపర్ హిట్ గా నిలిచాయి. అందులో ఒకటి ఆయన నటించిన ‘హీరో’చిత్రం.

ఈ చిత్రం ఓ నిధికి సంబంధించిన కథతో నడుస్తుంది. చిరంజీవి సరసన రాధిక నటించింది. అయితే ఈ చిత్రం టైటిల్ తో కొంత మంది హీరోలు నటించినా పెద్దగా సక్సెస్ కాలేదు. తాజాగా అర్జున్ రెడ్డి తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ఈ టైటిల్ తో రాబోతున్నాడు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది.

ఆనంద్ అన్నామలై దర్శకత్వం వహిస్తున్నారు. దక్షిణాది నాలుగు భాషల్లో ఈ సినిమా తెరకెక్కబోతున్నది. ఏప్రిల్ 22 న ఢిల్లీలో ఈ సినిమా ప్రారంభం కాబోతున్నది. ఈ చిత్రానికి సంబంధించిన అఫిషియల్ ప్రకటన త్వరలో ప్రకటిస్తారు.