మధుబాల గుర్తుందా.. చిన్ని చిన్ని ఆశ అంటూ రోజా సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. తెలుగు, తమిళ తెరపై చాన్నాళ్లపాటు తన అభినయంతో ఆకట్టుకుంది.
నటిగా గుర్తింపు తెచ్చుకున్న మధుబాల పెళ్లయ్యాక కొంతకాలం పాటు సినిమాలకు దూరమయ్యారు. అప్పుడెప్పుడో 2008లో వచ్చిన కభీ సోచా భీ నా థా అనే హిందీ సినిమాతో సెకెండ్ ఇన్నింగ్స్ ప్రారంభించినా పెద్దగా అవకాశాలు రాలేదు. తెలుగులోనూ ఒకటీ అరా తప్ప పెద్ద పాత్రలు దక్కలేదు.
తాజాగా ఆమె తమిళంలో అగ్ని దేవి అనే సినిమా చేస్తోంది. పవర్ఫుల్ రాజకీయ నాయకురాలి పాత్రలో నటిస్తోంది. ఎన్ని సినిమాలు చేసినా మధుబాలకు ఒక తీరని కోరిక మాత్రం ఉండిపోయిందట. ఎన్ని పాత్రలు చేసినా ఒక్క దానికీ అవార్డు రాలేదట పాపం.
ఒక్క అవార్డు కూడా రాకపోవడం మధుబాలకను కలచివేస్తోందట. అగ్నిదేవి సినిమాలో తన పాత్ర చాలా చిత్రమైందట. నిజ జీవితంలో ఎక్కడా చూడలేమట. ఈ సినిమాతో కచ్చితంగా అవార్డు కొట్టేస్తానంటోంది మధుబాల. పాపం.. ఆమె కోరిక ఈ సినిమాతోనైనా తీరాలని ఆశిద్దాం.