మహర్షి సినిమా మొదటి షో నుండి మంచి టాక్ తెచ్చుకుంది. ఓవర్సీస్ లో ప్రీమియర్స్ కలక్షన్స్ పెద్దగా లేకున్నా ఓవరాల్ గా 1 మిలియన్ మార్క్ దాటేసింది. ఇక 5 రోజుల్లో తెలుగు రెండు రాష్ట్రాల్లో 50 కోట్లు షేర్ దాటేసి మహేష్ స్టామినా ఏంటో ప్రూవ్ చేసింది. అయితే మహేష్ ఫైనల్ టార్గెట్ ఎంత.. నాన్ బాహుబలి రికార్డులను తన పేరున రాసుకునే వీలుందా అన్నది ఇప్పుడు అందరి డౌట్.
బాహుబలి రికార్డులను కొల్లగొట్టడం ఇప్పుడప్పుడే ఏ హీరో సాధించలేని పని. కనీసం బాహుబలి తెలుగు రికార్డులను కూడా టచ్ చేయాలన్నా కాస్త టైం పడుతుంది. అయితే నాన్ బాహుబలి రికార్డులంటే మాత్రం రంగస్థలం రికార్డులను కొల్లగొట్టాల్సి ఉంటుంది. రాం చరణ్ హీరోగా సుకుమార్ డైరక్షన్ లో వచ్చిన రంగథలం బాక్సాఫీస్ ను షేక్ చేసింది.
ఇప్పుడు మహర్షి రంగస్థలం రికార్డుల మీద కన్నేసినట్టు తెలుస్తుంది. సూపర్ స్టార్ సినిమా అందులోనూ సూపర్ పాజిటివ్ టాక్ కచ్చితంగా మహేష్ స్టామినా చూపించేలా సినిమా వసూళ్ల సునామి సృష్టించాల్సిందే. మహేష్ స్టామినాకు అసలు సిసలు పరీక్షగా మహర్షి సినిమా వచ్చింది. ఎలాగు సూపర్ హిట్ అనిపించుకుంది కాబట్టి ఇక రాబట్టాల్సింది కలక్షన్సే.
అయితే ఆ బాధ్యత మాత్రం మహేష్ ఫ్యాన్స్ మీద ఉంది. సినిమా కోసం మహేష్ పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కినా నాన్ బాహుబలి రికార్డులను కూడా మహర్షి పేరున రాసేయాలన్నది సూపర్ స్టార్ తపన. అయితే ఏరియా వైజ్ కలక్షన్స్, డే టూ డే చూస్తుంటే అది సాధించడం పెద్ద కష్టమేమి కాదనిపిస్తుంది.