ప్రపంచంలో ఒక మనిషి పోలికలతో ఏడుగురు ఉంటారని చెపుతూ ఉంటారు. దీనికి శాస్త్రీయమైన వివరణ దొరకకపోయినా జనం ఈ విషయాన్ని ఇప్పటికీ బాగా నమ్ముతున్నారు. ఇలాంటి పరిస్థుతులలో అచ్చం జూనియర్ ఎన్టీఆర్ ను పోలి ఉన్న ఒక వ్యక్తి ఫోటో సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారడమే కాకుండా ఆ ఫోటోను చూసిన జూనియర్ అభిమానులు కూడ షాక్ అవుతున్నారు. 

ప్రస్తుతం హడావిడి చేస్తున్న ఈ వ్యక్తి పేరు షమీందర్ చూడడానికి ఎన్టీఆర్ లా కనిపిస్తున్న ఇతడి రూపు రేఖలతో పాటు కళ్ళు కూడ అచ్చం జూనియర్ లా కనిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా ఇతడు తెలుగు సినిమాల పట్ల అదేవిధంగా జూనియర్ పట్ల అభిమాని అని తెలుస్తోంది. 

దీనికితోడు ఈమధ్య ఇతడు ఎన్టీఆర్ డైలాగ్ లతో కూడిన తన టిక్ టాక్ వీడియోలను షమీందర్ తన ట్విటర్ లో పెట్టడంతో ప్రస్తుతం ఇతడికి సంబంధించిన వార్తలు జూనియర్ అభిమానుల మధ్య హాట్ టాపిక్ గా మారాయి. అంతేకాదు అనేక ప్రముఖ మీడియా సంస్థలు ఇతడి గురించి ప్రముఖంగా వార్తలు రాస్తున్నాయి. 

పంజాబ్ లోని బతిందా పట్టణానికి చెందిన ఇతడు ఏరోనాటికల్ ఇంజనీర్ అని తెలుస్తోంది. చూడటానికి అచ్చం జూనియర్ లా కనిపిస్తున్న ఈ వ్యక్తి తనకు సంబంధించిన ఫోటోలను జూనియర్ లా అభినయస్తున్న టిక్ టాక్ వీడియోలను తన ట్విటర్ ఇన్ స్టా గ్రామ్ ఎకౌంట్లలో షేర్ చేస్తూ వాటిని ఎన్టీఆర్‌ కు కూడ ట్యాగ్ చేస్తున్నాడు. అంతేకాదు వీటి పై జూనియర్ ను తన స్పందన చెప్పవలసిందిగా కోరుతున్నాడు. దీనితో డూప్లికేట్ ఎన్టీఆర్ వార్తలతో మీడియా హోరెత్తి పోతోంది..



మరింత సమాచారం తెలుసుకోండి: