‘నేనే రాజు నేనే మంత్రి’ సినిమా తరువాత చాల గ్యాప్ తీసుకుని తేజ దర్సకత్వం వహించిన ‘సీత’ ఈవారం విడుదల అవబోతోంది. ఈమూవీని ఎదో విధంగా హిట్ కొట్టాలని ప్రయత్నిస్తున్న తేజా వరస పెట్టి మీడియా సంస్థలకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు. 

ఈ పరిస్థుతులలో తేజ తన పై తానే వేసుకున్న సెటైర్ అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. తాను కళ్ళజోడు పెట్టుకున్నంత మాత్రాన మేధావిని కాదనీ అదేవిధంగా కళ్ళజోడు పెట్టుకునే వారు ఎవరూ కూడ మేధావులు అని ఎవరూ అనుకోవద్దనీ జోక్ చేసాడు. 

దీనితో తేజ కళ్ళజోడు జోక్ ఏ దర్శకుడుని టార్గెట్ చేస్తూ అన్న కామెంట్స్ అని అంటూ కొందరు ఆసక్తికర చర్చలు చేస్తున్నారు. ఈసినిమాలో నటించిన కాజల్ ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ ఒక సీన్ లో తాను నడుము వంగే సందర్భం వచ్చినప్పుడు ఆ సీన్ పరిపక్వత కోసం తనతో అనేకసార్లు టేకులు తీసుకుని తన నడుము ఓంగిపోయేలా తేజ పెట్టిన టార్చర్ తాను మరిచిపోలేను అంటూ ఈమధ్య కామెంట్స్ చేసిన విషయం తెలిసిందే. 

ఒక నెగిటివ్ షేడ్ లో ఉండే మోడ్రన్ సీత పాత్రలో నటించిన కాజల్ చుట్టూ తిరిగే ఈకథ తనకు హిట్ ఇస్తుందని బెల్లంకొండ శ్రీను గంపెడు ఆశతో ఉన్నాడు. ఎన్నికల ఫలితాలు వచ్చిన తరువాత ఎటువంటి హడావిడి లేకుండా ప్రశాంత వాతావరణం కనిపించే ఈ వీకెండ్ లో ‘సీత’ కనీస పాజిటివ్ టాక్ ను అయినా తెచ్చుకోగలిగితే మరిన్ని సినిమాలు తేజా నుండి వచ్చే ఆస్కారం ఉంది..    


మరింత సమాచారం తెలుసుకోండి: