ఆగస్టు 15న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతున్న ‘సాహో’ పై మరిన్ని అంచనాలు పెంచడానికి మరో వ్యూహం అనుసరిస్తున్నారు. ఈమూవీ టీజర్ ను నభూతోనభవిష్యతి అన్న తీరుగా తీర్చి దిద్దే విషయంలో ఈమూవీ నిర్మాతలు పెడుతున్న ఖర్చు సంచలనంగా మారింది.
సాధారణంగా ఒక టీజర్ మేకింగ్ కోసం భారీ సినిమా నిర్మాతలు కూడ రెండు నుంచి మూడు లక్షలు మించి ఖర్చు పెట్టారు. అలాంటిది ఈమూవీ టీజర్ ఇంటర్నేషనల్ స్థాయిలో ఉండేలా ఏకంగా 15లక్షలు ఖర్చు చేసి ఒక అద్భుతమైన హాలీవుడ్ మ్యూజిక్ బైట్ రాయల్టీ హక్కుల్ని చేజిక్కించుకున్నట్లు టాక్.
వాస్తవానికి ఈ టీజర్ మేకింగ్ కోసం పనిచేస్తున్న తమన్ ఈ టీజర్ కు సంబంధించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను తాను క్రియేట్ చేస్తాను అని చెప్పినా మరింత మంచి క్వాలిటీ కోసం ఇలా హాలీవుడ్ మూవీ మ్యూజిక్ డైరెక్టర్ నుండి ఈ ప్రత్యేకమైన మ్యూజిక్ బైట్ ను అధికారికంగా తీసుకున్నట్లు సమాచారం. దీనితో కేవలం ఒక నిముషం లోపు ఉండే ఈ టీజర్ కోసం ఇంత భారీ స్థాయిలో ఖర్చు పెట్టడం సంచలనంగా మారింది.
ఇప్పటికే మేకింగ్ పూర్తి చేసిన ఈ టీజర్ ను వివిధ ఛానల్స్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ‘సాహో’ టీజర్ ని సల్మాన్ ఖాన్ నటించిన భరత్ మూవీ ప్రదర్శింపబడే ధియేటర్స్ లో కూడ ఆసినిమా ఇంటర్వెల్ ముందు చూపెట్టబోతున్నారని తెలుస్తోంది. ఈ టీజర్ తో ‘సాహో’ మార్కెట్ ఊపు అందుకుంటుందని నిర్మాతల ప్లాన్..