ఈవారం విడుదల కాబోతున్న కార్తికేయ ‘హిప్పి’ మూవీ పై అంచనాలు బాగానే ఉన్నాయి. దీనితో ఈసినిమాను బాగా ప్రమోట్ చేస్తున్నారు. ఈమూవీలో చాలాకాలం తరువాత జెడీ చక్రవర్తి ఒక కీలక పాత్రను చేస్తున్నాడు. ఈమూవీని ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇతడు అనేక ఆసక్తికర విషయాలు షేర్ చేస్తూ హీరోలు అందరిపై తన అభిప్రాయాలను బయటపెట్టాడు.
చిరంజీవిని చూడగానే తనకు ఎనర్జీ వస్తుందని బాలకృష్ణలో కాన్ఫిడెన్స్ తనకు ఇష్టమని చెపుతూ నాగార్జున స్వీట్ మేనర్స్ వెంకటేష్ బ్రాడ్ షోల్డర్స్ తనకు ఇష్టం అంటూ సీనియర్ టాప్ హీరోల పై తన అభిప్రాయాలు వెల్లడించాడు. ఇదే సందర్భంలో ఎన్నికల ఫలితాల పై స్పందిస్తూ తాను ఎదో ఒక నియోజక వర్గం నుండి పవన్ కళ్యాణ్ గెలుస్తాడని ఆసించానని అంటూ పవన్ ఓటమి తనను ఎంతో బాధపెట్టిన విషయాన్ని తెలియచేసాడు.
ప్రస్తుత తరం టాప్ యంగ్ హీరోల గురించి మాట్లాడుతూ మహేష్ కొంటె చూపు ‘పోకిరి’ లాంటి సినిమాలకు బాగుంటుందని అయితే మహేష్ ఇప్పుడు ఎందుకు వరసపెట్టి సందేశాత్మక సినిమాలు చేస్తున్నాడో తనకు అర్ధం కావడం లేదు అని కామెంట్స్ చేసాడు. ఇక రామ్ చరణ్ మంచి మేనర్స్ ఉన్న వ్యక్తి అనీ అల్లు అర్జున్ జెన్యూన్ పర్సన్ అనీ వ్యాఖ్యానించాడు. అయితే తనకు ప్రభాస్ తో పరిచయం లేదని చెపుతూ విజయ్ దేవరకొండ మాత్రం చాల ఓపెన్ మైండెడ్ గా ఉంటాడు అంటూ జెడీ చక్రవర్తి కామెంట్స్ చేసాడు.
ఇక చివరిగా జూనియర్ ఎన్టీఆర్ దూకుడు స్వభావం గురించి మాట్లాడుతూ ఒకసారి తాను జూనియర్ కారులో ఒక దూర ప్రాంతంలోని ఊరుకు వెళ్ళవలసిన పరిస్థితి ఏర్పడింది అంటూ జూనియర్ తన కారును 120 కిలోమీటర్ల స్పీడ్ తో తనను పక్కన కూర్చో పెట్టుకుని కారును నడిపిన సందర్భాన్ని వివరిస్తూ ఆనాటి కారు ప్రయాణంలో జూనియర్ తనకు చుక్కలు చూపెట్టిన విషయాన్ని బయట పెట్టాడు. ఆతరువాత తాను జూనియర్ కారును ఎక్కడానికి భయపడటమే కాకుండా కారులో జూనియర్ పక్కన కూర్చోవడానికి కూడ తాను ఇప్పటికీ భయపెడుతున్న విషయాన్ని వివరించాడు. ‘హిప్పీ’ సక్సస్ అయితే జెడీ చక్రవర్తికి తరిగి మరిన్ని అవకాశాలు వచ్చే ఆస్కారం ఉంది..