ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో లెక్కలేనన్ని ఛానళ్ళు  రాజ్యమేలుతున్నాయి అన్న విషయం తెలిసిందే. ఒక వార్తను ఒకరిపై ఒకరు పోటీగా తామే ముందు అంటూ ప్రసారం చేస్తూ సామాన్యుల మైండ్ ను బ్లాంక్ చేస్తున్నాయి అన్న విషయం ఎవరైనా ఒప్పుకునేదే. ఈ మధ్య హైదరాబాద్ లో ఇటీవలే విడుదలైన 'లంచ్‌ బాక్స్‌' ప్రమోషన్‌ కార్యక్రమంలో లో భాగంగా ఆ సినిమా హీరో దర్శకుల అభిప్రాయాలను ఒక ఛానల్ తీసుకుంది. ఆ కార్యక్రమాన్ని కూడా తమ చానల్ లో ప్రసారం చేసింది. 
తర్వాత మరో ఛానల్‌ ఇదే సినిమా దర్శక హీరోల దగ్గరకి ఇంటర్వ్యూకు వెళితే ఇంతకుముందే ఇంటర్వ్యూ ఇచ్చాను కదా ఆ యూనిట్ అన్నదట. దానికి ఆ ఛానల్ వారు అది వేరే ఛానల్ అని అనడమే కాకుండా ఆ ఛానల్ నెంబర్ టు, మాది నెంబర్ వన్ ఛానల్ అని చెప్పారట.

దానితో ఖంగ్ తిన్న ఆ బాలీవుడ్ యూనిట్ ఆంధ్రప్రదేశ్ లో ఇన్ని ఛానల్స్  ఉన్నాయా? అంటూ ఆశ్కర్యపడ్డారట. ఇటువంటి సంఘటనయే పవన్ అత్తారిల్లు డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ కు కూడా జరిగిందీ అని అంటున్నారు. అత్తారింటి సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఒక ప్రముఖ ఛానల్‌కు త్రివిక్రమ్ ఇంటర్వ్యు  ఇచ్చాడని  తెలిసిన వెంటనే మరో ఛానల్‌ ఆయనను ఆహ్వానించిందట. అప్పటికే అనేక విషయాలు చెప్పిచెప్పి అలసిపోయిన త్రివిక్రమ్  తర్వాత చూద్దాంలేండి అని సున్నితంగా చెప్పాడట.  

దీనితో హర్ట్‌ అయిన ఆ ఛానల్  వెంటనే అత్తారింటికి సినిమాపై నెగెటివ్‌ దాడి ప్రారంభించింది. అసలు దర్శకుడు త్రివిక్రంలో  పసలేదు, అత్తారిల్లు సినిమాను పలానా సినిమాకు కాపీగా త్రివిక్రమ్ తీసాడు అంటూ అసలు  పవన్‌ లేకపోతే సినిమానే లేదు అంటూ వార్తలు ప్రసారం చేయడం మొదలుపెట్టింది. దీనితో త్రివిక్రమ్ షాక్ కు గురి అయ్యాడట. ఈ నేపధ్యంలో ఒక ప్రముఖ ఛానల్ పవన్ కళ్యాణ్ తో ఇంటర్వ్యూ చేద్దామని ప్రయత్నించినప్పుడు మొదటగా పవన్ ఆ ఛానల్ ఇంటర్వ్యు ఇద్దామని అనుకున్న త్రివిక్రమ్ కు జరిగిన అనుభవాన్ని దృష్టిలో పెట్టుకుని పవన్ మీడియా వాళ్ళకు ఇంటర్వ్యూ ఇవ్వడానికి భయపదిపోతున్నాడని టాక్...

మరింత సమాచారం తెలుసుకోండి: