రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వంలో రాబోతున్న భారీ హైటెక్ యాక్షన్ డ్రామా ‘సాహో'. రెబెల్ స్టార్ అభిమానుల ఉత్కంఠని రోజురోజుకి పెంచుతూ మూడు భాషల్లో ఇండిపెండెన్స్ డే కానుకగా అగస్ట్ 15న ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం రిలీజ్ కానుంది. అయితే ఈ భారీ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా భారీగానే జరుగుతుంది. నైజాం ఏరియాలో ఈ చిత్రాన్ని దిల్ రాజు విడుదల చేయబోతున్నాడు.
తాజాగా ఈ సినిమాకి సంబంధించి నైజాం మరియు వైజాగ్ హక్కులను దిల్ రాజు భారీ మొత్తానికి కొనుగోలు చేశారు. దీనికి సంబంధించి త్వరలోనే అధికారిక ప్రకటన రానుంది. ఇక వచ్చే వారం నుండీ సాహో పోస్ట్ ప్రోడక్షన్ కార్యక్రమాల్లో ఫుల్ బిజీ కానుంది. జూన్ మూడో వారం నుండి ప్రభాస్ డబ్బింగ్ చెప్పనున్నాడు.
కాగా 'సాహో' మీద ఉండాల్సిన స్థాయిలో అంచనాలు లేకపోయినా.. హాలీవుడ్ మరియు బాలీవుడ్ కి చెందిన ప్రముఖ సాంకేతిక నిపుణులు 'సాహో' కోసం పనిచేయడం, అలాగే.. డినో యురి 18 కెడబ్ల్యూ వంటి సాంకేతిక పరిజ్ఞానంతో ఈ సినిమా విజువల్స్ ని క్యాప్చర్ చేయడం.. వంటి అంశాలు 'సాహో' మీద హోప్స్ పెంచుతున్నాయి.