
హైదరాబాద్: ప్రభాస్ కథానాయకుడిగా నటించిన ‘సాహో’ టీజర్ ఎట్టకేలకు విడుదలైంది. భారీ యాక్షన్ సన్నివేశాలతో రూపొందించిన ఈ టీజర్ సోషల్‌మీడియాలో దూసుకెళుతోంది. ఇప్పటికే ట్విటర్ ట్రెండ్స్‌లో రెండో స్థానంలో ఉంది. టీజర్‌ను చూసి అభిమానులే కాదు సినీ ప్రముఖులు కూడా సర్ప్రైజ్ అయ్యారు. టీజర్‌పై వారిచ్చిన రివ్యూలివి..
రాజమౌళి: పెట్టిన బడ్జెట్‌కు యూవీ క్రియేషన్స్, బాధ్యత విషయంలో సుజీత్ సమానంగా న్యాయం చేస్తున్నారు. ‘సాహో’ టీజర్ అద్భుతంగా ఉంది. ప్రభాస్ బలం ఏంటంటే.. హ్యాండ్సమ్గా ఉన్నాడు, మరోపక్క డార్లింగ్లానూ కనిపిస్తాడు.
అక్కినేని నాగార్జున: ఇంత గొప్ప సినిమాను తీస్తున్నందుకు ప్రభాస్‌కు, యూవీ క్రియేషన్స్‌కు ‘సాహో’.
రానా దగ్గుబాటి: ‘సాహో’ టీజర్ వచ్చేసింది.. సినిమా కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నాను.
నితిన్: ‘సాహో’ టీజర్ చాలా ఆసక్తికరంగా ఉంది. నా డార్లింగ్ ఫ్రెండ్ ప్రభాస్‌కు ఆల్ ది బెస్ట్.
శర్వానంద్: టీజర్ అదిరిపోయింది.
మంచు విష్ణు: బాబోయ్.. ఆ టీజర్ ఏంటి? బ్రిలియంట్. చూడబోతే ప్రభాస్, దర్శకుడు సుజిత్ కలిసి ఏదో అద్భుతాన్ని సృష్టించబోతున్నారు. టీజర్ చాలా నచ్చింది.
అల్లు శిరీష్: భారతదేశపు అతిపెద్ద యాక్షన్ థ్రిల్లర్ చిత్రమిది. తెలుగు సినిమా నుంచి రాబోతున్న మరో అద్భుతం. హాలీవుడ్‌ను పోలి ఉన్న విజువల్స్. గెట్ రెడీ ఇండియా.
సురేందర్‌రెడ్డి: టీజర్ ఫెంటాస్టిక్‌గా ఉంది. ప్రభాస్, సుజీత్, శ్రద్ధా కపూర్, యూవీ క్రియేషన్స్‌కు ఆల్ ది బెస్ట్.
సిద్ధార్థ్: దిమ్మతిరిగిపోయింది. యువ దర్శకుడు సుజీత్ తెరకెక్కిస్తున్న రెండో చిత్రమిది. చిత్రబృందానికి ఆల్ ది బెస్ట్. ‘డై హార్డ్ ఫ్యాన్స్’ గురించి తెలిసిందేగా.
పరుచూరి గోపాలకృష్ణ: ‘సాహో’.. ఓహో అని ప్రేక్షకుల నీరాజనాలు పొందాలని కోరుకుంటూ, మా ప్రభాస్ ప్రభాకర తేజస్సుతో వెలిగి పోవాలని ఆశీర్వదిస్తున్నాను.
బెల్లంకొండ శ్రీనివాస్: వాట్ ఎ యాక్షన్ టీజర్.. చాలా బాగుంది. చిత్రబృందానికి బెస్ట్ విషెస్.
మారుతి: ఇలాంటి స్టఫ్ ఇస్తే ఫ్యాన్సే కాదు ప్రతీ సినీ ప్రేమికుడు ‘సాహో’కి డై హార్డ్ ఫ్యానే.
అడివి శేష్: వావ్..
ఛార్మి: ఓహో డార్లింగ్ ప్రభాస్.. ‘సాహో’ టీజర్ సూపర్.
సుశాంత్: వావ్.. ‘సాహో’ ఊహించినదానికంటే విభిన్నం.
సందీప్ కిషన్: అదిరిపోయింది.. తెలుగు సినిమా ఎక్కడికో వెళ్లిపోయింది ప్రభాస్ అన్నా.
సాయి ధరమ్ తేజ్: కొత్త ట్రెండ్లు సెట్ చేస్తున్నారు. సినిమా బ్లాక్‌బస్టర్ అయిపోతుంది.
పూరీ జగన్నాథ్: సాహో.. హ్యాట్సాఫ్.
తమన్నా: సాహో టీజర్ గురించి ఎంత పొగిడినా తక్కువే. చాలా నచ్చింది. సినిమా కోసం చాలా ఎదురుచూస్తున్నాను.
రాహుల్ రవీంద్రన్: బూమ్.. నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది సుజీత్.
హర్షవర్ధన్ రాణే: సాహో టీజర్‌ను ఐదు సార్లు చూశాను.
గోపీచంద్: సూపర్ ఫెంటాస్టిక్ టీజర్. నా స్నేహితుడు ప్రభాస్‌కి ఆల్ ది బెస్ట్.