మహానటి సినిమాతో సౌత్ లో క్రేజీ హీరోయిన్ గా మారింది కీర్తి సురేష్. మహానటి తర్వాత తెలుగులో కన్నా తమిళంలో వరుస సినిమాలు చేస్తూ వచ్చిన కీర్తి సురేష్ ఇప్పుడు టాలీవుడ్ వరుస ఛాన్సులు అందుకుంటుంది. ప్రస్తుతం మహేష్ కోనేరు నిర్మాణంలో ఓ లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తున్న కీర్తి సురేష్ కింగ్ నాగార్జున మన్మథుడు 2లో కూడా స్పెషల్ రోల్ చేస్తుంది.


ఇక ఇప్పుడు మరో అక్కినేని హీరో నాగ చైతన్యతో జోడీ కడుతుంది ఈ అమ్మడు. నాగార్జున మన్మథుడు 2లో నాగ్ లవర్ గా నటిస్తున్న కీర్తి సురేష్ అదే టైంలో నాగార్జున, నాగ చైతన్య కలిసి చేస్తున్న బంగార్రాజు సినిమాలో చైతుకి జంటగా నటిస్తుంది. తండ్రి కొడుకులు ఇద్దరికి కీర్తి సురేష్ కావాల్సి వచ్చింది.


అప్పట్లో ఏయన్నార్, నాగార్జున ఇద్దరు శ్రీదేవితో కలిసి సినిమాలు చేశారు. ఆ తర్వాత ఆ ఛాన్స్ రకుల్ ప్రీత్ సింగ్ కు వచ్చింది. ఇప్పుడు కీర్తి సురేష్ కూడా నాగ్, నాగార్జున ఇద్దరితో జత కట్టింది. నాగార్జున అండ్ ఫ్యామిలీలో కాకుండా మెగాస్టార్ చిరంజీవి, రాం చరణ్ కూడా కాజల్ తో కలిసి నటించారు.


రాం చరణ్ తో మగధీర, నాయక్, గోవిందుడు అందరివాడేలే వంటి సినిమాల్లో కాజల్ నటించగా చిరు రీ ఎంట్రీ మూవీ ఖైది నంబర్ 150లో ఆమె హీరోయిన్ గా నటించింది. ఇలా తండ్రి కొడుకులు ఇద్దరు ఒకే హీరోయిన్ తో స్క్రీన్ షేర్ చేసుకోవడం కాస్త కష్టమే అయినా సినిమా కోసం తప్పేలా లేదని అంటున్నారు. మరి కీర్తి సురేష్ ఎలా మెప్పిస్తుందో చూడాలి.    
 


మరింత సమాచారం తెలుసుకోండి: