ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెల్లడి అయిన తరువాత పవన్ కు ఎదురైన ఘోర ఓటమి అవమానాన్ని తప్పించు కోవడానికి ‘జనసేన’ అధినేత మళ్లీ సినిమాల్లో నటించాలి అంటూ పవన్ వీరాభిమానుల చేసిన ఒత్తిడి ఓపెన్ సీక్రెట్. కానీ దానికి భిన్నంగా పవన్ తనకు మళ్ళీ సినిమాలలోకి వచ్చే ఉద్దేశ్యం లేదు అంటూ సంకేతాలు ఇవ్వడమే కాకుండా భావిష్యత్తులో తన కుటుంబ అవసరాల కోసం ‘జనసేన’ ఆర్ధిక లక్ష్యాల కోసం నిర్మాతగా మారి పవన్ సినిమాలు తీస్తాడు అంటూ ఒక వార్త చేస్తున్న హడావిడి పై పవన్ అభిమానులకు ఒక సందేహం వెంటాడుతోంది. 

పవన్ నిర్మాతగా మారి తీయబోయే సినిమాలలో మెగా హీరోలు చాలామంది నటిస్తారు అని వార్తలు వస్తున్నా కేవలం ఈ నిర్మాత ప్రయోగాలు ఎంత వరకు పవన్ ఆర్ధిక అవసరాలు తీరుస్తాయి అంటూ అభిమానుల సందేహాలు. ప్రస్తుత కాలంలో ఒక సినిమా హిట్ అయినా ఆ సినిమా తీసే నిర్మాతకు పట్టుమని పది కోట్లు లాభం రావడం చాల కష్టం అయిపోతోంది అన్న వాస్తవాలు పవన్ కు తెలియదా అంటూ అభిమానులు గందరగోళంలో ఉన్నారు. 

పవన్ నటించడానికి అంగీకరిస్తే అతడికి ఉన్న క్రేజ్ రీత్యా 25 నుండి 30 కోట్ల వరకు పారితోషికం ఇవ్వడానికి నిర్మాతలు అనేకమంది రెడీగా ఉన్న పరిస్థుతులలో ఆవిషయాలను వదిలి పవన్ చేయబోతున్న నిర్మాత ప్రయోగం ఏమాత్రం అతడికి మంచిది కాదు అన్న అభిప్రాయంలో అభిమానులు ఉన్నారు. దీనితో సినిమాల నిర్మాణం ఆలోచనలు మానుకోమని అభిమానులు వేల సంఖ్యలో పవన్ కు మెసేజ్ లు పెడుతున్నట్లు టాక్. 

దీనికితోడు ప్రస్తుతం సినిమా నిర్మాణంలో విపరీతమైన పోటీ ఏర్పడిన నేపధ్యంలో ఎంతో శ్రద్ధ పెట్టి సినిమాలు తీసే అనుభవజ్ఞులైన ఫుల్ టైం ప్రొడ్యూసర్లు కూడ ఫెయిల్ అవుతున్న పరిస్థుతులలో పవన్ కు నిర్మాతగా నిలదొక్కుకునే స్థానం ఎక్కడ ఉంది అన్న సమాధానం లేని ప్రశ్నలు అభిమానులను కలవర పెడుతున్నాయి. దీనితో ఇప్పటికే అనేక రిస్క్ లు చేసి తన కెరియర్ ను లెక్క చేయకుండా అడుగులు వేస్తున్న పవన్ నిర్మాత ప్రయోగాలు కన్నా తనే హీరోగా ఏడాదికి ఒక్క సినిమా చేసుకున్నా ‘జనసేన’ కు మంచి జరుగుతుంది అంటూ పవన్ అభిమానుల అభిప్రాయాలను పవన్ ఎంత వరకు ఆలోచిస్తాడు అన్నది ప్రస్తుతానికి సమాధానం లేని ప్రశ్న..  



మరింత సమాచారం తెలుసుకోండి: