స్టార్ హీరోయిన్ సమంత పెళ్లి తర్వాత కూడా తన హవా కొనసాగిస్తుంది. ప్రస్తుతం జూలై 5న ఓ బేబీ అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సమంత సినిమాలో డిఫరెంట్ రోల్ లో కనిపిస్తుంది. 70 ఏళ్ల బామ్మ సడెన్ గా 24 ఏళ్ల అమ్మాయిగా మారితే ఎలా ఉంటుంది అదే కథతో ఓ బేబీ సినిమా రాబోతుంది.


కొరియన్ మూవీ మిస్ గ్రానీ సినిమాకు అఫిషియల్ రీమేక్ గా వస్తున్న ఈ సినిమాను సురేష్ బాబు సంపరిస్తున్నారు. సినిమాలో నాగ శౌర్య, రాజేంద్ర ప్రసాద్, రావు రమేష్, లక్ష్మి, అడివి శేష్ వంటి స్టార్స్ నటిస్తున్నారు. మిక్కి జే మేయర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమా కోసం సమంత చాలా కష్టపడ్డదని తెలుస్తుంది.


బేబీ పాత్ర కోసం సమంత నిద్రలేని రాత్రులు గడిపిందట. సినిమా షూటింగ్ మరో 3 రోజులు ఉందనగనా ఆ పాత్ర ఎలా చేయాలో అర్ధం కాక తను నిద్రలేని రాత్రులు గడిపానని చెప్పింది సమంత. సినిమా మొదలైన నాటి నుండి పూర్తయ్యే వరకు అదే పరిస్థితి కొనసాగించిందట. అంత కష్టపడ్డది కాబట్టే ట్రైలర్ లో బేబీగా సమంత నటనకు మంచి మార్కులు పడ్డాయి.


బామ్మ పాత్రలో లక్ష్మి నటిస్తుండగా ఆమె సడెన్ గా సమంతగా మారి చేసే అల్లరి సినిమాలో చూడాల్సిందే. నందిని రెడ్డి డైరక్షన్ లో వస్తున్న ఈ సినిమా అవుట్ పుట్ మీద పూర్తి నమ్మకంగా ఉన్నారు చిత్రయూనిట్. సినిమా తప్పకుండా ప్రేక్షకులను మెప్పిస్తుందని అంటున్నారు. మరి సమంత ఓ బేబీ ఎలాంటి సందడి చేస్తుందో తెలియాలంటే జూలై 5 వరకు వెయిట్ చేయాల్సిందే.



మరింత సమాచారం తెలుసుకోండి: