
నాగచైతన్య తండ్రి కాకుండానే అతడికి ‘బెస్ట్ ఫాదర్’ అవార్డులు ఇస్తోంది సమంత ‘ఓ బేబి’ ప్రమోషన్ లో భాగంగా ఒక మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇస్తూ చైతన్య ఓర్పు పై సమంత షాకింగ్ కామెంట్స్ చేసింది. తాను మంచి తల్లిని అవుతానో అవనో చెప్పలేకపోయినా చైతు మాత్రం తమ పిల్లలకు మంచి తండ్రి అవుతాడని అభిప్రాయ పడింది.
దీనికి ఒక ఉదాహరణగా చైతన్యకు పెంపుడు కుక్కలు అంటే ఉన్న ఇష్టం గురించి చెపుతూ తమ ఇంటిలో 6 కుక్కలను కన్న బిడ్డల కంటే ఎక్కువగా చూసుకునే చైతన్య స్విమింగ్ పూల్ లో తన కుక్కలకు ఓర్పుతో ఈత నేర్పించిన విషయాలను చెప్పింది. కేవలం పెంపుడు కుక్కలా విషయంలో అంత కేర్ తీసుకునే చైతన్య తమ పిల్లల విషయంలో ఇంకెంత జాగ్రత్తగా చూసుకుంటాడో తనకు తెలుసు అంటూ చైతూకి ఇంకా తండ్రి కాకుండానే బెస్ట్ ఫాదర్ అవార్డ్ ఇచ్చింది.
తన ‘ఓ బేబి’ సినిమా గురించి మాట్లాడుతూ ఈమూవీలోని హాస్య సన్నివేశాలలో తన నటన మరింత మెరుగు పడటానికి తనతో కలిసి నటించిన రాజేంద్రప్రసాద్ ఎన్నో సూచనలు ఇచ్చాడు అంటూ ఈమూవీ విజయం కోసం తనతో పాటు కష్టపడ్డ అనేకమంది నటీనటుల కష్టం పై ప్రశంసలు కురిపించింది. ముఖ్యంగా ఈమూవీ డైరెక్టర్ నందినీ రెడ్డి ఈమూవీ కోసం పడ్డ కష్టం ముందు తాను పడ్డ కష్టం చాల తక్కువ అంటూ ప్రశంసలు కురిపించింది.
ఈమూవీని సురేశ్ ప్రొడక్షన్స్ నిర్మిస్తూ ఉండటంతో పాటు ఆ సంస్థ 50 సంవత్సరాల వార్షికోత్సవ సందర్భంగా విడుదల కావడం తనకు గౌరవంగా మారింది అంటూ తనను ప్రోత్సహించిన దగ్గుబాటి కుటుంబానికి తాను రుణపడి ఉంటాను అంటూ కామెంట్స్ చేసింది. గుర్తుకు చేసుకుంది. కామెంట్స్ చేసింది. ఈమూవీకి ఏర్పడ్డ భారీ క్రేజ్ రీత్యా ఓపెనింగ్ కలక్షన్స్ విషయంలో ఎటువంటి సందేహం లేకపోయినా ఒక ప్రయోగాత్మకమైన కథను సాధారణ ప్రేక్షకులు ఎలా రిసీవ్ చేసుకుంటారు అన్న విషయమై ఈమూవీ ఘన విజయం ఆధారపడి ఉంటుంది..