బిగ్ బాస్ తెలుగు 3వ సీజన్ కు రెడీ అయ్యింది. ఈసారి హోస్ట్ గా కింగ్ నాగార్జున రంగంలోకి దిగుతున్నాడు. మొదటి సీజన్ తారక్, రెండో సీజన్ నానిలు హోస్ట్ గా వ్యవహరించగా ఈసారి నాగార్జునని హోస్ట్ గా ఎంపిక చేశారు. ఇందుకు ఆయన రెమ్యునరేషన్ గా కూడా భారీ మొత్తాన్నే డిమాండ్ చేశాడట.
అంతేకాదు కంటెస్టంట్స్ విషయంలో కూడా నాగార్జున చాలా జాగ్రత్త పడుతున్నారట. బిగ్ బాస్ సీజన్ 1 ఓకే కాని సీజన్ 2 కౌశల్ వల్ల చాలా నష్టం వచ్చింది. షో సక్సెస్ అయినా ఫైనల్ విన్నర్ ఎవరన్నది ఆడియెన్స్ చేతుల్లోకి వెళ్లింది. అందుకే ఈసారి అలాంటి స్ట్రాంగ్ కంటెస్టంట్స్ లేకుండా కంటెస్టంట్స్ అంతా చాలా కూల్ గా ఉండేలా చూడమంటున్నారట.
బిగ్ బాస్ సీజన్ 3 కోసం ఏకంగా 40 మంది ఫైనల్ కంటెస్టంట్స్ ను సిద్ధం చేసినట్టు తెలుస్తుంది. వారిలో ఇక 14 మంది షోలో పాల్గొంటారట. కంటెస్టంట్స్ లిస్ట్ ఒకటి బయట మీడియాలో తిరుగుతున్నా ఫైనల్ కంటెస్టంట్స్ చూసి ఆడియెన్స్ అందరు ఆశ్చర్యపడటం ఖాయమని చెబుతున్నారు. ప్రస్తుతం హౌజ్ నిర్మాణం, లోపల పనులు జరుగుతున్నాయట.
జూలై 21న బిగ్ బాస్ తెలుగు సీజన్ 3 మొదలవుతుందట. ఎప్పటిలానే శని, ఆదివారాల్లో నాగార్జున సందడి మిగత వారాల్లో హౌజ్ మెట్ల హంగామా రాత్రి 9:30 అయితే చాలు స్టార్ మా ట్యూన్ చేసుకోవాల్సిందే. బుల్లితెర ఆడియెన్స్ ను మెప్పించిన బిగ్ బాస్ సీజన్ 3 ఎలా ఉండబోతుందో అని అందరు ఎక్సైటింగ్ గా ఎదురుచూస్తున్నారు.