దేవదాస్ సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన రామ్ పోతినేని.. తనలోని ఎనర్జితో ప్రేక్షకులను మెప్పించి ఎజరిటిక్ స్టార్ గా క్రేజ్ తెచ్చుకున్నాడు. మొదటి సినిమాతోనే ఫిల్మ్ ఫేర్ అవార్డ్ అందుకున్న రామ్ తన కెరియర్ లో హిట్లు ఫ్లాపులు సమానంగా సాధించాడు. లేటెస్ట్ గా పూరి జగన్నాథ్ డైరక్షన్ లో ఇస్మార్ట్ శంకర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు రామ్.
ఒకప్పుడు స్టార్ డైరక్టర్ గా సూపర్ క్రేజ్ తెచ్చుకున్న పూరి ఈమధ్య వరుస ఫ్లాపులు తీస్తున్నాడు. టెంపర్ తర్వాత పూరి సినిమా అంటే భయపడేలా చేశాడు. అయినా సరే రామ్ ఛాన్స్ ఇచ్చాడు. అయితే రామ్ ఇచ్చిన ఛాన్స్ ను పూరి వాడుకుని సక్సెస్ ఫుల్ సినిమా చేశాడని తెలుస్తుంది.
ఈరోజు రిలీజ్ అయిన ఇస్మార్ట్ శంకర్ సినిమా పక్కా మాస్ మూవీగా ప్రేక్షకులను అలరిస్తుంది. పూరి మార్క్ టేకింగ్, రామ్ ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్ సినిమాకు ప్లస్ అయ్యాయి. హీరోయిన్స్ గ్లామర్ షో కూడా ఇస్మార్ట్ పాజిటివ్ టాక్ వచ్చేలా చేసింది. ముఖ్యంగా ఈ సినిమాలో రామ్ పర్ఫార్మెన్స్ కు ఫిదా అయ్యారు తెలుగు ఆడియెన్స్.
శంకర్ పాత్రలో రామ్ పూర్తి న్యాయం చేశాడు. సినిమా అంతా వన్ మ్యాన్ షో చేశాడని చెప్పొచ్చు. 2006లో తెరంగేట్రం చేసిన రాం తన 13 ఏళ్ల కెరియర్ లో 17 సినిమాలు చేశాడు. ఇన్నేళ్ల కెరియర్ లో ఈ రేంజ్ ఊర మాస్ రోల్ చేసిన సినిమా లేదని చెప్పొచ్చు. డ్యాన్స్, ఫైట్స్, డైలాగ్స్ అన్నిటిలో రామ్ తాను కూడా స్టార్ మెటీరియల్ అని మరోసారి ప్రూవ్ చేసుకున్నాడు. రామ్ ఫ్యాన్స్ కు ఇస్మార్ట్ శంకర్ థ్రిల్ చేసింది. ఇక యూత్, మాస్ ఆడియెన్స్ కు కూడా ఈ సినిమా నచ్చేలా ఉంది. మరి ఫైనల్ రిజల్ట్ ఎలా ఉంటుందో చూడాలి.